Taraka Ratna Heart Attack.. చిన్న వయసులోనే ఇప్పుడు ఎందుకు గుండెపోటు వస్తోంది.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మారిపోయింది.
మారుతున్న జీవన శైలి సహా అనేక కారణాలు చెబుతున్నారు చిన్న వయసులో గుండె పోటుకు సంబంధించి వైద్య నిపుణులు.
కానీ, ప్రముఖ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ ఎందుకు హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలాడు.? ఆయనేమో, స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతాడాయె.!
ఓ పన్నెండేళ్ళ కుర్రాడికి స్కూలు బస్సులో గుండె పోటు వచ్చింది. ఇంకో పద్ధెనిమిదేళ్ళ కుర్రాడు క్రికెట్ ఆడుతుండగా గుండుపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు.
పచ్చని పందిట్లో.. పెళ్ళి కొడుక్కి గుండె పోటు రావడంతో శుభకార్యం కాస్తా, విషాధ ఘట్టమైపోయింది. చెప్పుకుంటూ పోతే ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి ఇటీవలి కాలంలో.
Taraka Ratna Heart Attack.. కోవిడ్ తర్వాత మారిన పరిస్థితులు..
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్, కొత్త సమస్యను తెచ్చి పెడుతోంది. వెలుగు చూస్తున్న చాలా గుండె పోటు ఘటనల్లో ‘కోవిడ్’ జాడలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కోవిడ్ జాడలు.. అంటే, కోవిడ్ సోకి, కోలుకున్నారు కావొచ్చు.. కోవిడ్ రానివారు కావొచ్చు.. వ్యాక్సిన్ ప్రభావం వల్ల కూడా ఈ గుండె పోటు సమస్యలు ఎక్కువగా వుంటున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
అత్యవసర వినియోగం కిందనే కోవిడ్ వ్యాక్సిన్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది.

ప్రపంచంలోని మిగతా దేశాల్లో సంగతెలా వున్నా, ఇటీవలి కాలంలో మన భారతదేశంలో చిన్న వయసులోనే గుండె పోటు అనేది.. కేవలం కోవిడ్ వ్యాక్సిన్ వల్లనేనన్న అనుమానాలు రోజురోజుకీ బలపడుతున్నాయి.
సినీ నటుడు నందమూరి తారకరత్నకు గుండెపోటు విషయంలోనూ ఇవే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా వుంది.
కుప్పం ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం బెంగళూరు ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. వైద్యులు ఆయనకు ఎక్మో అమర్చినట్లుగా తెలుస్తోంది. తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిద్దాం.
Also Read: బీస్ట్ సమంత.! ‘తిండిలో కాదు, ‘పవర్’ నీ ఆలోచనల్లో.!
గుండె పోటు వచ్చే ముందు స్వల్పంగానైనా సంకేతాలు వుంటాయన్నది వైద్య నిపుణుల మాట. ఛాతీలో అసౌకర్యం వస్తే, ఏమాత్రం అలసత్వానికి చోటివ్వకుండా వైద్యుల్ని సంప్రదించాలి.
ఎవరికైనా గుండె పోటు వస్తే, వెంటనే సీపీఆర్ చేయడం.. వీలైనంత తక్కువ సమయంలో ఆసుపత్రికి తరలించడం ద్వారా ప్రాణాల్ని కాపాడేందుకు అవకాశాలు మెరుగువుతాయి.