Taraka Ratna Heart Stroke.. సినీ నటుడు నందమూరి తారకరత్న గుండె పోటుతో కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే.
టీడీపీ నేత, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ ‘యువగళం’ పేరుతో చేపట్టిన పాదయాత్ర ఈ రోజు ప్రారంభం కాగా, ఆ యాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు.
హుటాహుటిన ఆయన్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే పల్స్ లేదని గుర్తించిన వైద్యులు వెంటనే సీపీఆర్ నిర్వహించి, ఆయన ప్రాణాల్ని కాపాడగలిగారు.
Taraka Ratna Heart Stroke.. ప్రమాదం తప్పింది.. మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నాం..
ప్రమాదం తప్పిందనీ ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదనీ, 80 శాతం బ్లాక్స్ వుండడం వల్ల స్ట్రోక్ వచ్చిందని వైద్యులు చెప్పారనీ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Bala Krishna) వెల్లడించారు.
అబ్బాయ్ అస్వస్థతకు గురయ్యాడని తెలుసుకున్న వెంటనే హుటాహుటిన బాబాయ్ బాలకృష్ణ హుటాహుటిన ఆసుపత్రికి వెళ్ళారు.
వైద్యుల్ని అడిగి, తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసిన నందమూరి బాలకృష్ణ, మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం బెంగళూరుకి తారకరత్నని తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు.
యాంజియోగ్రామ్..
హార్ట్ స్ట్రోక్ వచ్చిన దరిమిలా, యాంజియోగ్రామ్ నిర్వహించిన వైద్యులు స్టెంట్ కూడా వేసినట్లు తెలుస్తోంది.
తారకరత్న ఆరోగ్య పరిస్థితిని మీడియాకి వివరించిన నందమూరి బాలకృష్ణ.. అభిమానుల ఆశీస్సులతో తారకరత్న త్వరలోనే పూర్తిగా కోలుకుంటాడని చెప్పారు.
Also Read: షారుక్ ఖాన్ ‘పఠాన్’ రివ్యూ.! కింగ్ ఈజ్ బ్యాక్.!
మరోపక్క యంగ్ టైగర్ ఎన్టీయార్ తన సోదరుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నందమూరి బాలకృష్ణకి ఫోన్ చేసి తెలుసుకున్నారు.
తారక రత్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.
నందమూరి తారక రత్న, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ తరఫున పోటీ చేయనున్న సంగతి తెలిసిందే.
గుడివాడ నియోజకవర్గం సహా రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు తారక రత్న తగిన ప్రణాళికలు రచించుకుంటున్నాడు.