Tarakaratna Health Update Balakrishna.. నందమూరి తారక రత్నకు తీవ్రమైన గుండు పోటు వచ్చాక.. కాస్సేపటికే మళ్ళీ గుండె కొట్టుకోవడం ప్రారంభించిందట.!
ఇది నిజంగానే అద్భుతమని సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెబుతున్నారు.
బెంగళూరు నారాయణ హృదయాల ఆసుపత్రిలో తారక రత్నకు అందుతున్న వైద్య సహాయంపై ఎప్పటికప్పుడు అక్కడే వుండి సమీక్షిస్తున్నారు నందమూరి బాలకృష్ణ.
అభిమానుల పూజలు ఫలిస్తాయ్..
అభిమానులు తారక రత్న కోలుకోవాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్నారనీ, వారి ఆశీస్సులు ఫలించి తారక రత్న కోలుకుంటాడని నందమూరి బాలకృష్ణ చెప్పారు.
‘వైద్య చికిత్సకు తారక రత్న స్పందిస్తున్నాడు. ఒక్కోసారి స్పందించడంలేదు. కుప్పం నుంచి నారాయణ హృదయలయ ఆసుపత్రికి తరలించేటప్పుడు వున్న పరిస్థితే ఇప్పుడూ కొనసాగుతోంది’ అని తారక రత్న హెల్త్ విషయమై బాలకృష్ణ కీలక అప్‌డేట్ ఇచ్చారు.
‘కళ్ళు కదుపుతున్నాడు.. అప్పుడప్పుడూ శరీరంలోని మరికొన్ని భాగాలూ స్పందిస్తున్నాయి.. రెండు మూడు రోజులు పడుతుంది.. పూర్తి స్పష్టత రావడానికి..’ అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.
‘బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం వుంది. అయితే, ఎక్కువ ప్రభావం వుండకపోవచ్చు. పూర్తి వివరాలు ముందు ముందు తెలుస్తాయి’ అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
కాగా, తారక రత్నకి స్టెంట్ వేయడం కుదరలేదనీ.. ఇంకోసారి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం వుందనీ.. అది నివారించేందుకు వైద్యులు తగిన చర్యలు తీసుకుంటున్నారనీ బాలయ్య (Nandamuri Bala Krishna) వెల్లడించారు.
Tarakaratna Health Update Balakrishna.. పూర్తిగా వెంటిలేటర్ మీదనే..
తారక రత్న ప్రస్తుతం పూర్తిగా వెంటిలేటర్ మీదనే వున్నాడన్న బాలకృష్ణ, అవసరమైన వైద్య సహాయాన్ని వైద్యులు పూర్తి స్థాయిలో అందిస్తున్నట్లుగా వివరించారు.
Also Read: ఎన్టీయార్, ఏయన్నార్‌లనే లెక్క చేయని ‘జమున’.!
ప్రముఖ కన్నడ సినీ నటుడు శివ రాజ్ కుమార్, నందమూరి తారక రత్న (Nandamuri Taraka Ratna) ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు ఆసుపత్రికి వచ్చారు.
‘తారక రత్న కళ్ళు కదులుతున్నాయ్.. ఖచ్చితంగా కోలుకుంటాడు’ అని చెప్పారు శివ రాజ్ కుమార్.