Tarakaratna Treatment Balakrishna Efforts ఈ మధ్య నందమూరి బాలకృష్ణ పేరు తరచూ వార్తల్లోకెక్కుతోంది.
కొంత వివాదాస్పదంగా కూడా ఆయన మీద మీడియాలో వార్తా కథనాలు వస్తున్నాయ్. ఆయా సందర్భాలు వేరు.
కానీ, ఈసారి బాలయ్యను అంతా దేవుడనేస్తున్నారు. ‘నందమూరి తారక రత్న విషయంలో బాలకృష్ణ నిజంగానే దేవుడు..’ అని తెలుగు తమ్ముళ్ళు బలంగా నమ్ముతున్నారు.
నందమూరి అభిమానులైతే, ‘నీ కష్టం చూడలేకపోతున్నాం బాలయ్యా.. నువ్వు దేవుడివయ్యా..’ అంటూ స్పందిస్తున్నారు.
Tarakaratna Treatment Balakrishna Efforts.. తారక రత్నకి అన్నీ తానే అయి..
నందమూరి బాలకృష్ణ సోదరుడు నందమూరి మోహన కృష్ణ తనయుడే తారక రత్న. బాబాయ్ అంటే తారకరత్నకి అమితమైన అభిమానం. అబ్బాయ్ తారక రత్న అన్నా కూడా బాలయ్యకి అంతే ప్రేమాభిమానం.
తన బిడ్డ.. గుండె పోటుతో కుప్ప కూలిపోతే.. అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన ఆ తారకరత్నని చూసి బాలయ్య గుండె చలించిపోయింది.
కుప్పం ఆసుపత్రిలో అప్పటికప్పుడు ప్రత్యేక వైద్య చికిత్స అందేలా చేసి, ఆ తర్వాత బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రితో సంప్రదింపులు జరిపారు బాలకృష్ణ.
సరే, చెవిలో మృత్యుంజయ మంత్రం చెప్పి.. తారకరత్న గుండె తిరిగి కొట్టుకునేలా బాలయ్య చేశాడంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యల వ్యవహారం.. ఆ వెటకారం, వివాదం.. ఇక్కడ అప్రస్తుతం.
బెంగళూరులో.. మరింత బాధ్యతగా..
బెంగళూరులో నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తారకరత్నని చేర్చింది మొదలు.. బాలయ్యకు కంటి మీద కునుకు అసలే లేదట.
ఆ పరీక్షలు.. ఈ పరీక్షలు.. ఇలా తారకరత్న వైద్య చికిత్సకు జరుగుతున్న వ్యవహారాల్నిటినీ నందమూరి బాలకృష్ణ స్వయంగా పర్యవేక్షించారు.
బసవతారకం ఆసుపత్రికి ఛైర్మన్ కూడా కదా.. బెంగళూరు ఆసుపత్రి వైద్యులకీ.., హైద్రాబాద్‌లోని ప్రముఖ వైద్యులకీ కమ్యూనికేషన్ ఏర్పాటు చేసి.. తారకరత్నకు మెరుగైన వైద్యం అందేలా చేస్తున్నారు బాలకృష్ణ.
Also Read: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’: బాబోయ్.! భయపెట్టేస్తున్నారు.!
టీడీపీ మీద నిత్యం రాజకీయ విమర్శలు చేసే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, తారకరత్నకు అందుతున్న వైద్య చికిత్స విషయంలో నందమూరి బాలకృష్ణకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
విజయసాయిరెడ్డి తోడల్లుడి కుమార్తె అలేఖ్య రెడ్డి, తారకరత్న భార్య కావడంతో.. తారకరత్నను బెంగళూరు ఆసుపత్రిలో విజయసాయిరెడ్డి పరామర్శించారు.
అయినా, విజయసాయిరెడ్డి.. లేదా ఇంకొకరు అన్నారని కాదుగానీ.. ఆసుపత్రిలో బాలయ్యను చూసినవారెవరికైనా.. తారకరత్న విషయంలో నువ్వు దేవుడివి బాలయ్యా.. అనకుండా వుండలేకపోతున్నారు.
ఇదిలా వుంటే, తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగు పడిందనీ, గుండె పోటు కారణంగా 40 నిమిషాలపాటు బ్రెయిన్‌కి, ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందనీ.. ప్రస్తుతం గుండె సహా అన్ని ముఖ్య అవయవాలూ సరిగ్గా పనిచేస్తున్నాయనీ, మెదడులో వచ్చిన సమస్య కొద్ది రోజుల్లో నయమవుతుందని విజయసాయిరెడ్డి చెప్పారు.