షణ్ముఖ్ జశ్వంత్ (Shanmukh Jaswanth) బిగ్‌బాస్‌లోకి రావడానికి ముందే బోలెడంత పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. అనూహ్యంగా ఓ యాక్సిడెంట్ కేసులో ఇరుక్కుపోయి వివాదాల్లోకి ఎక్కాడు. అప్పటిదాకా అతనిపై ఉన్న పోజిటివిటీ అంతా గాయబ్ అయిపోయింది దాంతో.
బిగ్‌బాస్ విషయానికి వద్దాం. పక్కాగా ప్లాన్ చేసుకుని ఉన్నాడో ఏమో, షణ్ముఖ్ జస్వంత్ అలియాస్ షన్నూకి విపరీతమైన అభిమాన గణం కనిపిస్తోంది సోషల్ మీడియా వేదికగా.
హౌస్‌లో షన్నూ(అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరిది) ఏం చేస్తున్నాడో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ.. అన్నట్లుంది వ్యవహారం. షన్నూ అసలేమీ చేయట్లేదా.? చేసినా బిగ్‌బాస్ చూపించట్లేదా.? ఇది వేరే చర్చ.
తాజాగా దాదాపు హౌస్‌లో ఉన్న మేల్ కంటెస్టెంట్స్ అందరూ షన్నూని ఎలిమినేషన్ కోసం నామినేట్ చేసి పడేశారు. దీనిపై తనను తాను ప్రశ్నించుకోవల్సింది పోయి, నా ఎదురుగా నన్నెవరూ నామినేట్ చేయలేదుగా.. అని సంబరపడిపోతున్నాడు. షన్నూ ఇలా ఉంటే, షన్నూ అభిమానులు ఇంకో టైపులో ఉన్నారు.
హమీదా మీద షన్ను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘టీమ్ షన్నూ’ అనే ముసుగులో హమీదాని తూలనాడుతున్నారు. పేరుకే ఇది రియాల్టీ షో. కానీ, అక్కడ జరిగేదంతా జస్ట్ ఓ గేమ్. అదంతా స్ర్కిప్టెడ్ యాక్టింగ్. బయటికొచ్చాకా, ఏ ఇద్దరి మధ్యా విబేధాలు ఉండాల్సిన అవసరమే లేదు.
హమీదాపై జరుగుతున్న దారుణమైన ట్రోలింగ్ నేపథ్యంలో హమీదా అభిమానులు కూడా గట్టిగానే స్పందిస్తున్నారు. షన్నూ తెలుగు నాట చాలా మందికి తెలుసు. హమీదా మాత్రం బిగ్‌బాస్ ద్వారానే తెలుసు. అయినా కానీ, ఆమెకు మద్దతు పెరుగుతోందంటే, దానర్ధం షన్నూ టీమ్ తప్పు చేస్తోందనే.
షన్నూ టీమ్ (Shanmukh Jaswanth) చేసే ఓవరాక్షన్ షన్నూ మీద అందరికీ బ్యాడ్ ఇంప్రెషన్ పడేలా చేస్తుందన్నది నిర్వివాదాంశం. హమీదా మీదనే కాదు, అందరి విషయంలోనూ షన్నూ టీమ్ ‘అతి’ మామూలుగా లేదు.