Table of Contents
Telugu Chutney Politics: రాజకీయాలెంతగా దిగజారిపోయాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి అవసరం లేదు. గట్టి చట్నీ గురించి రాజకీయాల్లో చర్చ జరగడమంటేనే, అదొక దౌర్భాగ్యం.!
అసలు రాజకీయ నాయకులు రాజకీయాలెందుకు చేస్తున్నారో వాళ్ళకైనా తెలుసో లేదో.! రాజకీయ నాయకుల సంగతి పక్కన పెడితే, ‘గట్టి చట్నీ’ గురించి మాట్లాడే స్థాయికి దిగజారిపోయిన రాజకీయ నాయకుల్ని చట్ట సభలకు పంపుతున్న ఓటర్లని.. అదేనండీ ప్రజల్ని ఏమనాలి.?
చెడ్డోడు వర్సెస్ ఇంకా చెడ్డోడు.!
ప్రజల్ని ఏమీ అనలేని పరిస్థితి. ఎందుకంటే, రాజకీయాలు ఆ స్థాయికి దిగజారిపోయాయ్. వాడు మంచోడా.? వీడు మంచోడా.? అని ఆలోచించుకునే అవకాశం ప్రజలకి లేదు.
‘వాడు చాలా చెడ్డోడు, వాడితో పోల్చితే వీడు కొంచెమే చెడ్డోడు..’ అని మాత్రమే ప్రజలు రాజకీయ నాయకుల్ని ఎంచుకోవాల్సిన దుస్థితి వచ్చేసింది.
Telugu Chutney Politics.. ఏ చట్నీ తింటే ఎవడిక్కావాలి.?
ఎవడు ఏ చట్నీ తింటే ఎవడిక్కావాలి.? ఎవడు ఏది తిని ఎంతలా బలిసిపోతే ఎవడిక్కావాలి.? ప్రజలకు కావాల్సింది మరి పాలన.!
కానీ, ఎన్నికల వేళ ఓట్ల కోసం కరెన్సీ నోట్లు, ఇతరత్రా తాయిలాలు పంచుతున్నాం కాబట్టి, తాము ఎలాంటి రాజకీయం చేసిన‘ పడి వుండాలి’ అన్నట్టుగా ప్రజల్ని రాజకీయ నాయకులు శాశిస్తున్నారు.
ఆడ, మగ.. అన్న తేడాల్లేవు. ఒకరికి ఇంకొకరి మీద కనీసపాటి గౌరవం లేదు. గౌరవం సంగతి దేవుడెరుగు, అసలు మనుషులమన్న విషయాన్నే రాజకీయ నాయకులు మర్చిపోతున్న రోజులివి.
బొత్తిగా సిగ్గొదిలేశారంతే.!
నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టు, బొత్తిగా సిగ్గొదిలేసి రాజకీయాలు (Andhra Pradesh Telangana Chutney Politics) చేస్తున్నారు నేటి తరం రాజకీయ నాయకులు. పైగా ఈ దరిద్రం ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా కనిపిస్తోంది.
Also Read: కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టిన.!
తమ కుటుంబ సభ్యులైనా తమ ప్రవర్తనను మన్నిస్తారా.? అన్న కనీసపాటి సోయలేని రాజకీయ నాయకులు, రాజకీయాల్లో రాణిస్తున్న దుస్థితిని చూస్తున్నాం.
ఎవరేమనుకుంటే మనకేంటి.? ఓట్లేసిన జనం ఎలా పోతే మనకేంటి.? అధినేత మెప్పు కోసం నోటికొచ్చినట్లు మాట్లాడతాం.. మీడియా మైకులు కనిపించగానే చెలరేగిపోతాం.. అనుకుంటే ఇదిగో ఇలాగే వుంటుంది.!
వస్త్రధారణ దగ్గర్నుంచి, ఆయా నాయకుల బరువు, ఎత్తు, రంగు.. ఇలా అన్నిటిమీదా చెత్త కామెంట్లే.! రాజకీయ నాయకులా.? వీధి రౌడీలా.? అన్న ప్రస్తావన వస్తే.. వీధి రౌడీలే బెటర్.. అన్నట్టు తయారైంది పరిస్థితి.