Telugu Cinema 2027 Releases.. సంక్రాంతి వెళ్ళి, ఇంకా పూర్తిగా నెల రోజులు కూడా కాలేదు.!
అప్పుడే, 2027 సంక్రాంతికి సంబంధించి స్లాట్స్ అన్నీ బుక్ అయిపోయాంటూ తెలుగు సినీ పరిశ్రమలో అలజడి షురూ.!
వెంకటేష్ దగ్గుబాటి సినిమా వస్తోందట.. నందమూరి బాలకృష్ణ సినిమా కూడా వచ్చేస్తోందట.. మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా ఫిక్సయ్యిందట.
తానేం తక్కువ తిన్లేదంటూ అక్కినేని నాగార్జున కూడా రంగంలోకి దిగేశాడంట.! ఇలా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అధికారికంగానో, అనధికారికంగానో ప్రకటనలూ వచ్చేస్తున్నాయ్.
ఇంతకీ, పవన్ కళ్యాణ్ సినిమా పరిస్థితేంటి.? అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీయార్ లైట్ తీసుకున్నారా.? రవితేజ సంక్రాంతి ఛాన్స్ వదులుకుంటాడా.? ఇలా బోల్డన్ని డిస్కషన్లు.
Telugu Cinema 2027 Releases.. పవన్ కళ్యాణ్ సినిమా సెట్స్ మీదకు వెళ్ళకుండానే..
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఇంకా సెట్స్ మీదకే రాలేదు, అప్పుడే సంక్రాంతి విడుదల.. అంటూ, గాసిప్స్ పుట్టుకొచ్చేస్తున్నాయి.
సంక్రాంతి అంటే, తెలుగు సినిమాకి పెద్ద పండగ.. ఇది నిజమే. కానీ, ఎన్ని సినిమాల్ని సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకోగలదు.?
మొన్నటికి మొన్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ హిట్టవడంతో, మిగిలిన సినిమాలకు ఓవర్ ప్లోస్ వర్కవుట్ అయ్యాయి. భారీ అంచనాలతో వచ్చిన ‘ది రాజా సాబ్’ నిరాశపర్చింది.
వస్తాయనుకున్న సినిమాలు వెనక్కి వెళతాయి.. అనూహ్యంగా కొన్ని రేసులోకి దూసుకొస్తాయ్. అదే సినిమ్యాజిక్.! సో, ‘తుత్తర’ అనవసరం.
Also Read: ఈ ‘గాలి వార్త’ని వండి వడ్డించిందెవరు?
నిర్మాణంలో కొన్ని సినిమాలు ఆలస్యమవ్వొచ్చు.. రిలీజ్ టెన్షన్లు కొన్ని సినిమాలకు ఎదురవ్వొచ్చు.. చాలా ఈక్వేషన్స్ వుంటాయ్.
సంక్రాంతి కాకపోతే, సమ్మర్.. ఇందులో వింతేముంది.? ఏడెనిమిది నెలల తర్వాత, సంక్రాంతి సినిమాల విషయమై ఓ క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశముంటుంది.
అప్పటిదాకా ఈ రచ్చ ఇలానే కొనసాగుతుంది. ఏదో ఒక గాలి వార్త పోగేసి, సినీ పరిశ్రమలో అలజడికి కారణమవుతున్నారు కొందరు. చిత్రంగా అలాంటివారికి లీకులిస్తున్నారు సినీ పరిశ్రమకే చెందిన కొందరు.
ఇదో నయా రోగం.!
