Telugu Journalism Lady Journalists.. రాజకీయ నాయకులు కుక్కల్లా తిట్టుకుంటున్నారు.! మేమేం తక్కువ.? అన్నట్టుగా, మీడియా సంస్థలూ దిగజారిపోయాయి.
తమకేం తక్కువ.? అనుకున్నారేమో.. జర్నలిస్టులూ రోడ్డున పడి నానా ఛండాలమూ చేస్తున్నారు.! పైగా, మహిళా జర్నలిస్టులు.!
కొత్త విషయమేమీ కాదు, జర్నలిస్టులు కొట్టుకోవడం. కొన్నాళ్ళ క్రితం ఓ మేల్ జర్నలిస్టు కోసం ఇద్దరు ఫిమేల్ జర్నలిస్టులు నానా ఛండాలం చేశారు.
Telugu Journalism Lady Journalists.. పాత్రికేయమేనా ఇది.?
పేర్లెందుకుగానీ, ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఇద్దరు మహిళా జర్నలిస్టులు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారట.! కొట్టుకోవడం.. తిట్టుకోవడం.. అబ్బో, అదో ఛండాలం.!
అట కాదండీ, ఇది నిజం.! పైగా, ఎవరో ఓ పెద్దాయన దగ్గర ‘మెప్పు’ కోసం ఇద్దరి మధ్యా ఆదిపత్య పోరు నడిచిందట. దాంతో, గిచ్చుకున్నారు, జుట్టు పీక్కున్నారు.. చిన్నపాటి యుద్ధ వాతావరణం సృష్టించారు.
తెలుగు జర్నలిజం ఎంతలా దిగజారిపోయిందో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే.! జరిగిందేంటో అదరికీ తెలిసిపోయింది.
అబ్బే, మరీ అంతలా దిగజారిపోలేదుగానీ.. అంటూ కొందరు సీనియర్ జర్నలిస్టులు ఫాఫం.. దీర్ఘాలు తీయాల్సి వస్తోంది. తీస్తారు మరి, ప్చ్.. వారి బాధ వాళ్ళది.
వీడియోలు రిలీజ్ చేసుకున్నారు.!
సిగ్గుండాలి కదా మనిషన్నాక.! ఛత్.. సిగ్గూ ఎగ్గూ లేకుండా పోయిందిక్కడ.! ఔను, అస్సలు సిగ్గు లేదు. సిగ్గుంటే, వీడియోలెందుకు రిలీజ్ చేస్తారు ఆ గొడవ గురించి.
ఎవరో కాదు, వాళ్ళకు వాళ్ళే విడుదల చేసుకున్నారు వీడియోల్ని నిస్సిగ్గుగా.! ఇంతకీ, ఏ విషయంలో ఇద్దరికీ గొడవ వచ్చిందట.?
చవకబారుతనం.. అన్నది చాలా చాలా చిన్నమాట అది. దిగజారుడుతనం.. అన్నా సరిపోదు.! ఇంకోటేదో మాట వాడాలి.! దురదృష్టం.. రాస్తున్నాం కదా, ఇది కూడా జర్నలిజం లాంటిదే.. పైగా, మహిళల గురించిన వార్త.
Also Read: Rakesh Master.! అదే చంపేసింది.!
ఇలా రాయడానికి కాస్తంత బాధగానే వుంది. కానీ, తప్పదు. జర్నలిజం అంటే, సమాజం బాగు కోసం. ఆ సమాజమే సిగ్గుతో తలదించుకునేలా చేస్తే, అస్సలు సమర్థనీయం కాదు.
పురుషాధిక్య సమాజంలో.. జర్నలిస్టులుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఇద్దరు జర్నలిస్టులు.. తమ స్థాయిని అనూహ్యంగా దిగజార్చేసుకున్నారు. సభ్య సమాజానికి తప్పుడు సంకేతాలు పంపారు.!
రెస్ట్ ఇన్ పీస్ తెలుగు జర్నలిజం.!