Thaman Music Copy Cat: థియేటర్లలో సౌండ్ ఎక్విప్‌మెంట్ బద్దలైపోతుందేమో.. అన్నట్టుగా ఇటీవల తమన్ నేపథ్య సంగీతం వుంటోంది.
‘వకీల్ సాబ్’, ‘అఖండ’, ‘భీమ్లానాయక్’.. తదితర సినిమాలకు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏ స్థాయిలో ఆ సినిమాలకు అదనపు ఆకర్షణ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తమన్ పాటలు, నేపథ్య సంగీతమే కాదు.. ఆయన మాటలు కూడా చాలా ఘాటుగా వుంటాయ్. నెటిజన్లు ‘కాపీ క్యాట్’ అంటున్నారు కదా.? అంటే, ‘నేను క్యాట్ ఏంటి.? ఎద్దులా వున్నాను.!’ అంటూ తన మీద తానే బాడీ షేమింగ్ చేసుకుంటూ, అదేదో గొప్ప సెటైరనట్టు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడేశాడు తమన్.\
Thaman Music Copy Cat.. బాగా క్రిటికల్ సుమీ.!
‘కాపీ’ అంటే అంతలా తమన్ కంగారు పడ్డాడన్నమాట. అదీ అసలు విషయం. ‘రాధేశ్యామ్’ సినిమాకీ తమన్ నేపథ్య సంగీతం అందించాడు. ‘సినిమా కాస్త స్లోగా వున్నట్టుంది..’ అని పాత్రికేయులు ‘రాధేశ్యామ్’ సినిమా ప్రెస్‌మీట్ సందర్భంగా అడిగితే, తమన్‌కి క్రిటిక్స్ మీద ఒళ్ళు మండిపోయింది.
క్రిటిక్స్ రివ్యూలు రాయడం నేర్చుకోవడానికి ఏమైనా కాలేజీలు వున్నాయా.? అని ప్రశ్నించేశాడు. ఇదెక్కడి వింత.? సినిమా చూసే ప్రతి వ్యక్తీ ప్రేక్షకుడు మాత్రమే కాదు, విమర్శకుడు కూడా అవుతాడు. అలాగని సినిమాపై విమర్శ చేయడానికో, సినిమాని అభినందించడానికో.. ప్రత్యేకంగా ఏమన్నా చదువులు చదువుకోవాలా ఏంటి.?
కాలం మారింది.! ఆ సంగతి తమన్ కంటే బాగా ఇంకెవరికి తెలుస్తుంది.? తమన్ పాటల్ని వింటోంటే, ఆల్రెడీ వినేశాం కదా.. అనిపిస్తుంటుంది. ‘కాపీ ట్యూన్..’ అంటూ పలానా చోట నుంచి లేపేసిన వైనాన్ని ఆధారాలతో సహా నెటిజన్లు సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు.
అప్‌డేట్ అవ్వండి సామీ.!
తమన్ విషయంలో మాత్రమే కాదు, ఏ సంగీత దర్శకుడికైనా ఇదే సమస్య వస్తోంది. ‘మా దగ్గర చాలా అడ్వాన్స్‌డ్ సాఫ్ట్‌వేర్ వుంది.. కాపీకి ఛాన్సే లేదు..’ అన్నది తమన్ వాదన. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు.. ఇదీ అంతే, అదీ ఇంతే.!
తమన్ ఏదన్నా మంచి మాట చెబితే, పొగుడుతారు.. పై విధంగా సెటైర్లేస్తే, దానిపై కౌంటర్ ఎటాక్స్ కూడా గట్టిగానే జరుగుతాయ్. ‘తమన్ ఈ వాగుడేంది.?’ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు, తమన్ ‘క్రిటిక్స్’ మీద చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.
Also Read: ’సాహో‘కి అలా అన్నారు.! ‘రాధేశ్యామ్’కి ఎలా అంటున్నారంటే.!
కాంట్రవర్సీలు అవసరమా.? అనడక్కండి.. సెటైర్లేస్తే తద్వారా వచ్చే నెగెటివిటీ.. దాన్నుంచి లభించే అదనపు పబ్లిసిటీ.. (Thaman Music Copy Cat) ఆ కిక్కే వేరప్పా.!