Thank You Movie Nagachaitanya.. అక్కినేని నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘థాంక్యూ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంటోన్న నాగచైతన్య, ‘థాంక్యూ’ సినిమాతో మరో హిట్ సొంతం చేసుకుంటాడని అక్కినేని అభిమానులు ఈ సినిమా కోసం ధీమాగా ఎదురుచూశారు.
రాశి ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించగా, ఈ సినిమాలో తాను సూపర్ స్టార్ మహేష్‌బాబు అభిమానిగా కనిపిస్తానని నాగచైతన్య చెప్పిన విషయం, సినిమాకి మహేష్ అభిమానుల్నీ రప్పించింది.
ఇంతకీ, ‘థాంక్యూ’ సినిమా ఎలా వుంది.?
‘థాంక్యూ’ సినిమాకి సంబంధించి ప్రీమియర్ టాక్ ఏమంత గొప్పగా లేదు. తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ప్రీమియర్ షోస్ పడ్డాయి.

అక్కడి నుంచి వచ్చిన టాక్ ఒకింత బ్యాడ్‌గానే వుందని చెప్పక తప్పదేమో. నాగచైతన్య నటుడిగా, ప్రయత్న లోపం లేకుండా ప్రతి సినిమాలోనూ మంచి ఔట్ పుట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడు.
‘థాంక్యూ’ విషయంలోనూ నాగచైతన్యను తప్పు పట్టడానికేమీ లేదనీ, కథ ఎంపిక విషయంలోనే పొరపాటు చేశాడన్నది సర్వత్రా వినిపిస్తోన్న విమర్శ.
Thank You Movie Nagachaitanya.. పూర్ ఓపెనింగ్స్.. అంతేనా.?
అడ్వాన్స్ బుకింగ్స్ అయితే చాలా డల్లుగా వున్నాయి. దానికి తోడు ప్రీమియర్ టాక్ కూడా బ్యాడ్‌గా వుండడంతో, ఓపెన్సింగ్ వీక్‌గా వున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read: Kangana Ranaut చెప్పే EMERGENCY కథ.. ఏ కోణంలో.!
నాగచైతన్య అభిమానులు మాత్రం, తమ అభిమాన హీరో.. హిట్టు ట్రెండు కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు.
అన్నట్టు, ఈ సినిమాలో మహేష్ రిఫరెన్స్ సన్నివేశాలకు ఈలలు, గోలలతో థియేటర్లు మార్మోగిపోతున్నాయ్. థియేటర్లలో నాగచైతన్య అభిమానులతో సమానంగా మహేష్ అభిమానులూ సందడి చేస్తున్నారు.