Thanuja Character Assassination BiggBossTelugu9 బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో.. అంటే, అందులో రొమాంటిక్ ట్రాక్స్ సర్వసాధారణం.
హౌస్‌లో ఎవరితో ‘మింగిల్’ అవుతావ్.? అని, హోస్ట్ నాగార్జున స్వయంగా అడిగేస్తుంటాడు.
మోనాల్ గజ్జర్ – అఖిల్ దగ్గర్నుంచి, చాలా ట్రాక్‌లు నడిచాయి బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోలో.. ఇంకా ఇంకా నడుస్తూనే వుంటాయవి.
ఫన్ కోసమే, ఆయా రొమాంటిక్ ట్రాక్స్ నడిస్తే.. అది తప్పేమీ కాదు. పైగా, రియాల్టీ షోలో నటులు ఎక్కువగా వుంటారు కాబట్టి, నటించడంలో వింతేముంది.?
కానీ, సీరియస్ ట్రాక్స్‌గా వీటిని హోస్ట్ అక్కినేని నాగార్జునతో వీకెండ్లో చెప్పించే ప్రయత్నం చేస్తుంటారు. నాగార్జున సీనియర్ మోస్ట్ యాక్టర్ కదా.. ఆయనకైనా, బాధ్యత వుండాలి.
Thanuja Character Assassination BiggBossTelugu9.. టార్గెట్ తనూజ..
తాజా సీజన్లో తనూజ – కళ్యాణ్ మధ్య ఏదో ‘లింకు’ అంటగట్టడానికి బిగ్ బాస్ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.
ఈ ఇద్దరి మీదా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ‘పచ్చళ్ళ పాప’ రమ్య చేసిన కామెంట్స్ అత్యంత జుగుప్సాకరం. మాధురితో కలిసి రమ్య, అత్యంత అసభ్యకరంగా మాట్లాడింది.
తనూజ శరీరమ్మీద, కళ్యాణ్ చేతులేస్తున్నాడనీ, తనూజ కూడా అవకాశం ఇస్తోందనీ.. అత్యంత అసహ్యంగా వుందనీ.. రమ్య చెప్పింది మాధురితో.
రెండు చేతులు కలిస్తేనే, శబ్దం వస్తుంది.. అంటూ, మాధురి ‘పరమాన్నం’ వండేసిందిక్కడ. ఇదంతా ఆల్రెడీ ప్రసారమైంది. దాన్ని ఇంకోసారి నాగార్జున ప్రస్తావించాడు.
కన్ఫెషన్ రూమ్‌లోకి తనూజని పిలిచి, ఆ వీడియో చూపించాడు నాగార్జున. దాంతో, తనూజ షాక్ అయ్యింది. తనకు హౌస్‌లో ఎవరితో అయినా జస్ట్ స్నేహం మాత్రమే వుందని చెప్పింది.
Also Read: ట్రంప్ లక్ష డాలర్ల దెబ్బ.! ఎన్ని H1B Visa వికెట్లు పడిపోతాయో.!
అసలే, బిగ్ బాస్ అంటే.. బ్రోతల్ హౌస్.. అనే విమర్శలు కొందరు రాజకీయ నాయకుల నుంచి చూశాం. ఆ విమర్శల్ని దృష్టిలో పెట్టుకుని అయినా, హోస్ట్ నాగార్జున జాగ్రత్త పడాలి కదా.!
రమ్య – మాధురి మధ్య సంభాషణని టెలికాస్ట్ అయినా చేయకుండా వుండాల్సింది. లేదంటే, వాళ్ళిద్దరికీ ‘మీరు మాట్లాడింది తప్పు’ అంటూ, నాగార్జున సీరియస్ వార్నింగ్ అయినా ఇచ్చి వుండాల్సింది.
రెండూ జరగలేదంటే, బిగ్ బాస్ రియాల్టీ షో వేదికగా, దేన్ని ప్రమోట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం ఎపిసోడ్లో తనూజకి క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది.
