The Legend Saravanan అసలు పేరు అరుల్ శరవణన్.! కానీ, ఆయనిప్పుడు లెజెండ్ శరవణన్.! సినిమా హీరో అంటే ఎలా వుంటాడు.? సినిమాల్లో హీరో ఎలా కనిపిస్తాడు.?
హీరోయిన్‌ని ప్రేమ పేరుతో టీజ్ చేసేవాడు.. రాత్రికి రాత్రి కోట్లకు అధిపతి అయ్యేవాడు.. ఒంటి చేత్తో పది మందినో, పాతిక మందినో.. వీలైతే వంద మందినో, కుదిరితే వయ్యి మందినో చంపేసేవాడు.. వెండితెర హీరో.!
మరి, రియల్ లైఫ్ హీరో ఎలా వుంటాడు.? కొడితే, ప్రత్యర్థి అల్లంత దూరాన ఎగరి పడకపోయినా, అలా కొట్టగలననే ధైర్యం నిండినోడే హీరో.
The Legend Saravanan.. ఇదీ హీరోయిజం అంటే.!
పది మందికి సాయం చేసేవాడూ హీరోనే. ఉద్యోగంలో కావొచ్చు, వ్యాపారంలో కావొచ్చు.. మరే రంగంలో అయినా రాణించేవాడు కూడా హీరోనే.!
ఇక్కడ మనం మాట్లాడుకుంటోంది రియల్ అండ్ రీల్ హీరో గురించి. ఆయన పేరు అరుల్ శరవణన్.! చెన్నయ్‌కి చెందిన వ్యాపారవేత్త అరుల్ శరవణన్.

ఈ అరుల్ శరవణన్ వందల కోట్ల, వేల కోట్ల వ్యాపారలు నిర్వహిస్తుంటారు. ఆయనిప్పుడు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం సుమారుగా 60 కోట్ల వరకు ఖర్చు చేశారట.
సొమ్ములు.. సోకులు.. కోరికలు.!
సరే, వందలు వేల కోట్లున్నప్పుడు, నటన అనే కోరికను తీర్చుకోవడానికి ఆమాత్రం ఖర్చు చేయకపోతే ఎలా.? బాలీవుడ్ నుంచి ఊర్వశి రౌతెలాని తీసుకొచ్చారు.. ‘ది లెజెండ్’ అనే సినిమా చేసేశారాయన.
బోల్డంతమంది హీరోయిన్లతో తన సినిమాకి ప్రచారం చేయించుకున్నారు. నిజానికి, ఓ స్టార్ హీరో సినిమాకి ఎలాగైతే ప్రచార కార్యక్రమాలు జరుగతాయో, అంతకు మించి అరుల్ శరవణన్ అలియాస్ లెజెండ్ శరవణన్ కోసం జరిగాయ్.1
Also Read: ఇన్‌స్టంట్ దర్శకులకు మెగాస్టార్ చిరంజీవి స్వీట్ వార్నింగ్.!
లక్షలు, కోట్లు వెదలజల్లారు కేవలం సినిమా పబ్లిసిటీ కోసం మాత్రమే. ‘ది లెజెండ్’ సినిమా ఎలా వుంది.? అన్నది వేరే చర్చ.
తన వ్యాపార సంస్థల ప్రమోసన్ కోసం ఆయా ప్రకటనల్లో నటించిన అరుల్ శరవణన్, ది లెజెండ్ శరవణన్‌గా వెండితెరపై తనదైన సంతకం చేసేందుకు చేసిన ప్రయత్నంలో రియల్ హీరోయిజం వుందన్నది నిర్వివాదాంశం.
వయసు యాభై పైనే.. ఓ కుమార్తెకు పెళ్ళి కూడా చేశాడు. కానీ, జస్ట్ పదహారేళ్ళ కుర్రాడిలా కనిపిస్తున్నాడు. ఎలా.? నటనకు వయసు అడ్డంకి కాదు.! నటన అనే కలని నిజం చేసుకున్నాడంతే.!