Table of Contents
Tiger Gold Teeth Implant.. ఈ పులిని వేటాడేది ఎవరోగానీ, అదష్టవంతులు.. ఎందుకంటే, పులి నోట్లో వున్న ఓ ’పన్ను‘ బంగారంతో చేయబడింది మరి.!
దంత సమస్యలతో బాధపడేవారికి, ‘ఆ పిప్పి పన్ను తీయించేసి, బంగారపు పన్ను పెట్టించుకోవచ్చు కదా..’ అని ఉచిత సలహాలు ఇస్తుంటారు చాలామంది.
డెంటల్ ఇంప్లాంట్ ఇటీవలి కాలంలో చాలా చాలా సాధారణ ప్రక్రియగా మారిపోయింది. నోట్లో ఒకటో, రెండో కాదు.. ఐదారు.. పది, పదిహేను వరకు ‘డెంటల్ ఇంప్లాంట్స్’ జరుగుతుండడం చూస్తున్నాం.
Tiger Gold Teeth Implant.. బంగారం పన్ను.. ప్లాటినం పన్ను.!
అలా నోట్లోనే బంగారాన్ని నింపేసుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అన్నట్టు, అందరూ బంగారంతోనే ‘పళ్ళు’ చేయించుకోలేరు కదా.. అది వేరే సంగతి.!
బంగారం మాత్రమేనా.? అత్యంత ఖరీదైన ఇతర లోహాలతోనూ పళ్ళు చేయించేసుకుని, ‘డెంటల్ ఇంప్లాంట్స్’ చేయించేసుకోవడమూ జరుగుతోంది.
కానీ, బంగారమే ఎక్కువగా వినియోగిస్తుంటారు ఈ డెంటల్ ఇంప్లాంట్స్ సందర్భంగా ఇతర లోహాల కంటే.!
లోహాలతో కాకుండా, పోర్సలెైన్ అనే పదార్థంతో సహజమైన పళ్ళను పోలి వుండేలా టూత్ క్రౌన్ తయారు చేస్తుంటారు. టైటానియంతో తయారైన స్క్రూతో పళ్ళను ఇంప్లాంట్ చేస్తారు.
అయినా, పులికేం తక్కువ.?
ఇక, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది, బంగారంతో చేసిన పన్ను గురించి.! అదీ, మనుషులకు సంబంధించినది కాదు, ‘పులి’కి సంబంధించింది.!
ఔను, ఓ పులికి ఏమయ్యిందోగానీ, ఓ పన్ను ఊడిపోయింది. వేట కోసం వినియోగించే కోర పళ్ళలో ఒకటి ప్రమాదవశాత్తూ విరిగిపోవడంతో, దాని స్థానంలో బంగారు పన్ను పెట్టారు.
ఎక్కడ.? అన్న విషయాన్ని పక్కన పెడితే, బంగారంతో చేసిన కోర పన్ను కలిగిన పులికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అరణ్యాల్లో తిరిగే క్రూర మృగాల గురించి, వాటి బాగోగుల గురించి ఎవరు పట్టించుకుంటారు.? ఆ ఛాన్సే లేదు.
పెంచుకున్న పులి.?
బహుశా ఈ పులి, పెంపుడు జంతువు అయి వుండాలి.! కొన్ని అభివృద్ది చెందిన దేశాల్లో పులుల్ని, ఇళ్ళల్లోనే పెంచుకుంటుంటారు. అద్గదీ అసలు సంగతి.
ఏమాటకామాటే చెప్పుకోవాలి..! పులి.. దాని బంగారు పన్ను.. అదుర్స్ కదా.!
‘ఈ పులిని వేటాడినోడికి అదనపు బోనస్.. అదే, బంగారు పన్ను.. మార్కెట్‌లో బంగారం రేటు బాగా పెరిగిపోయింది కదా..’ అంటూ కామెంట్ చేసేవారూ లేకపోలేదు.!
పులి చర్మం, పులి గోళ్ళు.. వీటికి మార్కెట్‌లో వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.! పులి దంతానికీ గిరాకీ వుందండోయ్.!
ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, పులుల్ని వధించే వేటగాళ్ళు తమ పని తాము చేసుకుపోతూనే వున్నారనుకోండి.. అది వేరే సంగతి.