Tiger Nageswara Rao FL మీకు తెలుసా.? పులుల్ని వేటాడే పులి అట.! బాబోయ్.. అలాంటిదొకటి వుంటుందా.? తెలుసుకోవాలనుకుంటే, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా చూసెయ్యండి.!
రవితేజ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ సినిమా ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది.
మాస్ మహరాజ్ రవితేజ సినిమాల్లో కొత్తదనం ఏముంటుంది.? అంతా రొట్టకొట్టుడు వ్యవహారమే.! ఈ ‘టైగర్ నాగేశ్వరరావు’లో కూడా కొత్తగా ఏమీ వుండకపోవచ్చు.
Tiger Nageswara Rao FL.. రావణాసుర.. టైగర్..
మొన్నీమధ్యనే ‘రావణాసుర’ సినిమా వచ్చింది. అందులో నెగెటివ్ షేడ్స్ వున్న క్యారెక్టర్‌లో కనిపించాడు రవితేజ. అలాగనుకుని సరిపెట్టుకోవాలంతే.
ఇక, ‘టైగర్ నాగేశ్వరరావు’ అంటే, ఇదొక బయోపిక్.! దేశంలోనే అతి పెద్ద దొంగ అట.. అలాగని, ఫస్ట్ లుక్‌లో పేర్కొన్నారండోయ్.!
స్టువర్టుపురం తెలుసు కదా.? ఒకప్పుడు దోపిడీ దొంగలకు కేరాఫ్ అడ్రస్.! కాదు కాదు, ఆ పేరు చెప్పి, స్టువర్టుపురం మనుషుల్ని దారుణంగా హింసించారన్నది ఇంకో వాదన.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘స్టువర్టుపురం పోలీస్ స్టేషన్’ పేరుతో చాన్నాళ్ళ క్రితం ఓ సినిమా వచ్చింది.
టైగర్ జోన్..
మరిప్పుడు, ఆ స్టువర్టుపురానికి చెందిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సంగతేంటట.? దీన్ని ఈసారి ‘టైగర్ జోన్’ అని పిలుస్తున్నారు ఈ సినిమాలో.
ఇంతకీ, ఈ పులి మంచిదా.? చెడ్డదా.? రవితేజ హీరో కదా.. దొంగ మంచోడే అయి వుంటాడు.!
Also Read: Dimple Hayathi Dishyum.. డీసీపీతో డింపుల్ డిష్యుం.!
అన్నట్టు, ఫస్ట్ లుక్ పోస్టర్‌ని వెరైటీగా లాంఛ్ చేశారు. అదీ, రాజమండ్రిలో.. గోదావరి నదిలో.!
వంతెన మీద. ఓ రైలు వచ్చింది.. అందులోంచి దొంగలు దిగారు.. పోస్టర్ లాంఛ్ చేశారు.! వావ్.. కాన్సెప్ట్ అదిరిపోయింది కదా.!

అసలే వేసవి కాలం.. ఈ టైటిల్ లాంఛ్ కార్యక్రమానికి వెళ్ళినోళ్ళు.. ఆ వేడికి తాళలేక నానా తంటాలూ పడాల్సి వచ్చింది. ఇదేం క్రియేటివిటీ మహానుభావా.?
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్ (Nupur Sanon) ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతోంది.
కాగా, చాలాకాలం తర్వాత రేణు దేశాయ్ (Renu Desai) ఈ సినిమాతో నటిగా రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది.