Table of Contents
Tiger Nageswara Rao Review.. పేరు మోసిన దొంగ మీద బయోపిక్కేంటి.? పైగా, అత్యంత పాశవికంగా హత్యలు చేసినోడి బయోపిక్కు.! ఇక్కడే వ్యవహారం తేడా కొట్టేసింది.
అసలు టైగర్ నాగేశ్వరరావు ఎవరు.? అతనొక దొంగ.! కరడుగట్టిన నేరస్తుడు.! అలాంటి నేరస్తుడి మీద సినిమా చేసేటప్పుడు ఎంత రీసెర్చ్ చేయాలి.?
ప్చ్.. రీసెర్చ్ ఏమీ చేసినట్లు కనిపించలేదు సినిమాలో.! చేతికొచ్చింది రాసి పారేసినట్టున్నారు.. అలాగే తీసి పారేశారు కూడా.!
సాధారణంగా రవితేజ సినిమాల్లో కనిపించే ఫక్తు కమర్షియల్ అంశాలే ఇందులోనూ వున్నాయి తప్ప, ఇదో బయోపిక్.. అన్న భావన ఎక్కడా కనిపించదు.
Tiger Nageswara Rao Review.. ఈడొక దొంగ.. ఇదొక సినిమా.!
దొంగతనాలు చేస్తాడు.. నరుకుతూ పోతాడు.. చిత్రంగా ఉద్ధరించేలాగానూ వ్యవహరిస్తాడు. ఇదేం పద్ధతి.?
ఇప్పటికీ స్టువర్టుపురంలో నాగేశ్వరరావు గురించి కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. అందులో నిజమెంత.? అన్న విషయాన్ని కనీసం పట్టించుకోకుండా.. తమక్కావాల్సిన అంశాల్ని సినిమా కోసం తీసుకున్నట్టుంది.
రవితేజ ఈ సినిమా కోసం కొత్తగా చేసిందేమీ లేదు. షరామామూలు మాస్ రొట్ట తప్ప.! రవితేజ లుక్ కూడా అంత ప్రభావితంగా కనిపించకపోవడం గమనార్హం.
ట్రైన్ ఎపిసోడ్ మరీ పిల్లలాట అయిపోయింది. మనిషిని నరికెయ్యడం.. అనేది సినిమాల్లో చాలా చాలా సిల్లీ థింగ్ అయిపోయింది ఈ మధ్య.
హింస.. రక్త పాతం.. ఇవే చాలు.!
హింస, రక్తపాతం.. ఇవే సినిమాకి ప్రధాన అంశాలు అనుకుంటున్నారేమో ఫిలిం మేకర్స్. సినిమా నిండా అదే కనిపిస్తుంటుంది. లవ్ ట్రాక్ ఎందుకో ఏమో, మేకర్స్‌కే తెలియాలి.
ఓ సాధారణ దొంగ, అసాధారణ స్థాయికి ఎదిగిన వైనాన్ని ఎఫెక్టివ్‌గా చూపించకుండానే, ప్రధాని వరకూ దొంగ చేరుకునేలా చూపించెయ్యడం కామెడీ కాకపోతే మరేమిటి.?
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. సినిమాటోగ్రఫీ ఓకే.! డైలాగ్స్ కూడా అంత గొప్పగా ఏమీ లేవు. నుపుర్ సనన్ కావొచ్చు, గాయత్రి భరద్వాజ్ కావొచ్చు.. ఈ ఇద్దరికీ దక్కిన ప్రాధాన్యత అంతంతే.!
రేణు దేశాయ్ విషయానికొస్తే, సుదీర్ఘ విరామం తర్వాత ఆమె చేసిన సినిమా ఇది. కానీ, ఆమె చేసిన పాత్రకి సినిమాలో అస్సలేమాత్రం ప్రాధాన్యత లేదు. అందులో ఆమె నటన కూడా తేలిపోయింది.
సినిమా కోసం జరిగిన ప్రచారానికీ.. సినిమాలో కంటెంటుకీ అస్సలు సంబంధం లేదన్నట్టు తయారైంది పరిస్థితి. అసలే నస అంటే, అది కూడా విపరీతమైన సాగతీత.
రవితేజ ఇప్పటికైనా మారకపోతే..
మొన్నామధ్య ‘రావణాసుర’ అనే సినిమా చేశాడు రవితేజ. అప్పడన్నా ఈ ‘టైగర్ నాగేశ్వరరావు’ గురించి ఆత్మవిమర్శ చేసుకుని వుండాల్సింది.
వున్నపళంగా రవితేజ (Raviteja) కథల ఎంపిక మీద జాగ్రత్త పడకపోతే.. అంతే సంగతులు.!
చివరగా.. ఈ మధ్య రివ్యూల్ని మేనేజ్ చేయగలిగితే, సినిమాని హిట్టు చేసేసుకోవచ్చనే భావన కొందరు సినీ ప్రముఖుల్లో ఎక్కువైపోయింది. దాంతో, కంటెంట్ మీద ఫోకస్ తగ్గిపోయింది. ‘టైగర్ నాగేశ్వరరావు’ కూడా అలాగే అనుకున్నాడా.?
ఫైనల్ టచ్.! పులి కాదు.. ఆ పులిని చూసి వాతలు పెట్టుకున్న నక్క నాగేశ్వరరావు.!