Premalu Review.. ప్రేమ అంటే ఏంటి.? బోల్డన్ని సినిమాలొచ్చాయ్‌గానీ, అసలంటూ సినిమాల్లో చూపించే ప్రేమలో ‘ప్రేమ’ ఎంత.? అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదాయె.!
ఓ సినిమాలో ప్రేమ అంటే త్యాగమని చెబుతారు. ఇంకో సినిమాలో అయితే, మోసం చేసి అయినా, ప్రేమని గెలిపించుకోవాలని చెబుతారు.!
ఏది నిజం.? సరే, ఇప్పుడీ ప్రేమ పురాణం ఎందుకంటే, ఓ సినిమా వచ్చింది ‘ప్రేమలు’ పేరుతో. స్ట్రెయిట్ తెలుగు సినిమా కాదు. కానీ, సినిమా షూటింగ్ చాలా భాగం హైద్రాబాద్‌లో జరుగుతుంటుంది.
Premalu Review.. మమిత బైజు.. కొత్త ముద్దుగుమ్మ..
కొత్త భామ మమిత బైజు, తెలుగునాట కుర్ర ప్రేక్షకులకి బాగా నచ్చేసింది. ఇంతకీ, ఆమెలో అంత ఆకర్షణ ఏముందబ్బా.? ప్చ్.. ఏమీ లేదు.
సినిమా టైటిలేమో ‘ప్రేమలు’.! కానీ, సినిమాలో ప్రేమ కనిపించదు. ఎక్కడా ప్రేమ సీరియస్‌గా వుండదు. అంతా చిల్లర వ్యవహారమే. చిల్లర కామెడీ.!
కాకపోతే, ఈ తరం కుర్రాళ్ళలో కొందరు ఎలా వుంటారో, అలాగే ఈ సినిమాలోని ప్రధాన పాత్రలన్నీ వున్నాయ్. నటీనటుల్లో ఎవరికీ పెద్దగా వంక పెట్టడానికేమీ లేదు. అలాగని, అద్భుతంగా నటించేశారనడానికీ ఏమీ లేదు.
కాసింత ఫన్ వుంది.. కొంత రొమాంటిక్ టచ్ వుంది.! మీ భీభత్సమైన మూతి ముద్దులైతే లేవు. ఓవర్ ది బోర్డ్ ఎక్స్‌పోజింగ్ కూడా లేదు.

కాకపోతే, తెలుగులో కొన్ని బూతు డైలాగులున్నాయ్.. బూతు అని తెలియకుండానే విచ్చలవిడిగా వాటిని వాడేశారు.
ఇలాంటి కథలతో చాలా సినిమాలొచ్చాయి. చాలా సినిమాల్లోని సన్నివేశాలు ఈ సినిమాలోనూ వున్నాయి.
ఔనూ.. ‘ప్రేమలు’ సినిమా బాలేదంటే, సమాజం నుంచి వెలివేసెయ్యరు కదా.? ఈ మధ్య కొన్ని సినిమాల విషయంలో అలాగే జరుగుతోంది.
ఫర్లేదు, ఓ పద్ధతి ప్రకారం సినిమాని నడిపించేశారు. అంతే, అంతకు మించి సినిమాలో ఏమీ లేదు.! రైల్లో సీన్.. ఐటీ కంపెనీలో సీన్స్.. ఇలా పేర్చుకుంటూ పోయారు.
సక్సెస్ ఫార్ములా.. అన్న కోణంలో అవసరమైన అన్ని విషయాల్నీ మిక్స్ చేసి వదిలేశారు ‘ప్రేమలు’ సినిమాలో.!
బోర్ కొట్టిందా.? లేదా.?
సినిమా అంతా ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తుంది. థియేటర్లలో ఎవరికైనా బోర్ కొట్టి వుండచ్చా.? వుండొచ్చుగాక.
ఓటీటీలో సినిమా చూస్తున్నంతసేపూ బోర్ కొట్టింది. కొంచెం నవ్వులున్నాయ్. అంతకు మించి, ‘ప్రేమలు’ అద్భుతమైన సినిమా అయితే కాదు.
కానీ, ‘ప్రేమలు’ తెలుగులో కాసుల పంట బాగానే పండించిందట. ఓటీటీలోనూ వ్యూస్ అదిరిపోతున్నాయి అన్ని భాషల్లోనూ.!
ఏ సినిమా ఎందుకు నచ్చుతుందో ఎవరికీ తెలీదు.! అన్నట్టు, మమిత బైజు, ఇప్పుడు టాక్ ఆఫ్ టాలీవుడ్‌లా తయారైంది. వరసుగా అవకాశాలు వచ్చిపడుతున్నాయట.
సినిమాటోగ్రఫీ, మ్యూజిక్.. ఇవన్నీ బాగానే వున్నాయ్. డైలాగ్స్ అయితే యూత్‌ని ఆకట్టుకునేలా వున్నాయి. కామెడీ పంచ్ డైలాగులు బాగానే పేలాయ్.
ఓవరాల్‌గా చూస్తే ‘ప్రేమలు’ వన్ టైమ్ ఓకే.. అంటే, జస్ట్ ఓకే.. అన్నమాట.! అహహా.. అన్నట్టు అద్భుతమైతే కాదు.!