Tillu Square Lilly Anupama.. అనుపమ పరమేశ్వరన్.. అంటే చబ్బీ చీక్స్.. డింపుల్ చిన్.. అనే క్యూట్ ఫేస్ గుర్తొస్తుంది. ‘అ ఆ’ సినిమాలో వల్లీ పాత్రలో ఇవే ఫీచర్స్‌తో పరిచయమై కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టేసింది.
కానీ, అదంతా గతం. ఇప్పుడు వల్లీ కాదు.. లిల్లీ టైమ్ నడుస్తోంది. అదేనండీ.! ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ పాత్ర పేరు ‘లిల్లీ’.!
సిద్దు జొన్నల గడ్డ హీరోగా వచ్చిన ‘డీజె టిల్లు’ సినిమా ఏ రేంజ్‌లో యూత్‌ని ఆకట్టుకుందో తెలిసిందే. ఈ సినిమాలో రాధిక పాత్ర పోషించిన హీరోయిన్ నేహా శెట్టి కూడా తెగ పాపులర్ అయిపోయింది.
Tillu Square Lilly Anupama.. వల్లీ కాదుగా ఈ లిల్లీ.! షి ఈజ్ సో హాట్ గురూ.!
మినిమమ్ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండించడం యూత్‌కి స్పెషల్ కిక్ ఇవ్వడంతో.. సీక్వెల్ కూడా తెరకెక్కించేశారు శరవేగంగా.
త్వరలో సినిమా రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఇక్కడ కిక్కిచ్చే విషయమేంటంటే.. అనుపమ పరమేశ్వరనే. ఈ సినిమా కోసం అనుపమ భీభత్సంగా హద్దులు దాటేసింది.

గ్లామర్ ప్రదర్శనే కాదు, ఏకంగా హీరోతో లెక్కలేనన్ని లిప్పు లాకులు లాగించేసింది. దాంతో, ప్రస్తుతం సోషల్ మీడియాలో అనుపమ పరమేశ్వరన్ ట్రెండింగ్ అయిపోయింది.
అనుపమా.! అంతలా మారిపోయావా.!
‘టిల్లు స్క్వేర్’ ప్రచార చిత్రాల్లో అనుపమను చూసిన వాళ్లంతా అవాక్కవుతున్నారంటే అతిశయోక్తి కాదేమో. ఎట్రాక్టివ్ ప్లేస్‌లో టాటూ.. హీరోతో ఘాటైన రొమాన్స్.. డబుల్ మీనింగ్ డైలాగ్స్.. వాట్ నాట్.!
అన్నీ చేసేసింది అనుపమ పరమేశ్వరన్. అసలే అనుపమకి ఈ మధ్య టైమ్ తెగ కలిసొచ్చేస్తోంది. ఇటీవల ‘కార్తికేయ 2’తో సూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత ‘18 పేజెస్’తోనూ ఓ మోస్తరు హిట్టే అందుకుంది.
Also Read: Nabha Natesh Lady Boss: ఇస్మార్ట్ చూపుల్తో చంపేస్తోంది బాస్
ఇక అవకాశాలంటారా.? వరుస పెట్టి వస్తూనే వున్నాయ్. వెరీ రీసెంట్‌గా మాస్ రాజా రవితేజతో ‘ఈగల్’ సినిమాలోనూ అనుపమ నటించేసింది.
అంచనాలకు తగ్గట్లుగా అన్నీ కలిసొచ్చి ‘టిల్లు స్క్వేర్’ సూపర్ హిట్టయ్యిందంటే.. ఇక వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు. పక్కా కమర్షియల్ హీరోయిన్‌గా అనుపమ సెటిలైపోవచ్చు.!