Titanic Accident Oceangate Titan.. టైటానిక్ షిప్ ఎప్పుడో మునిగిపోయింది.. వందల మందిని బలి తీసుకున్న ప్రమాదమది.!
నిజానికి, టైటానిక్ అంటే కేవలం మునిగిపోయిన ఓ లగ్జరీ షిప్ మాత్రమే కాదు.. అంతకు మించి.! ఆ విషాద గాధకు ప్రేమకథను జోడించి ‘టైటానిక్’ సినిమా తీస్తే అదో బంపర్ హిట్.
సముద్ర గర్భంలో కూరుకుపోయిన ఆ టైటానిక్ షిప్ గురించిన విశేషాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే వుంటాం. పరిశోధనలు జరుగుతూనే వున్నాయ్ దాని చుట్టూ.!
Titanic Accident Oceangate Titan.. ఇప్పుడు ఇంకో విషాదం..
బాగా బలిసిన ఓ సంపన్న కుటుంబం.. ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డ ఓ సబ్‌మెరైన్ ద్వారా సముద్ర గర్భానికి వెళ్ళే ప్రయత్నం చేసింది.
ఓ సంపన్నుడు, తనతోపాటు తన కుమారుడ్ని కూడా అందులో తీసుకెళ్ళాడు. ఆ సబ్‌మెరైన్ ద్వారా, ఎప్పుడో మునిగిపోయిన టైటానిక్ శకలాల దగ్గరకు వెళ్ళాలన్నది అతని ఆలోచన.
ప్చ్.. ఆ కోరిక తేడా కొట్టేసింది.! వందల కోట్లు ఖర్చు చేసి, ప్రాణాలు పోగొట్టుకున్నాడు. సబ్‌మెరైన్ ఆచూకీ గల్లంతయ్యింది. చివరికి అది కూలిపోయిందని నిర్ధారించారు.

మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు ఈ దుర్ఘటనలో. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా అందర్నీ విస్మయానికి గురిచేసింది.
తాజాగా సముద్రంలో కూలిపోయిన సబ్‌మెరైన్ పేరు ‘టైటాన్’. ఇదొక మినీ జలాంతర్గామి. అమెరికన్ కోస్ట్‌గార్డ్ ఈ విషయాన్ని ధృవీకరించింది.
పన్నెండు వేల అడుగుల లోతులో..
అట్లాంటిక్ మహా సముద్రంలో దాదాపు 12 వేల అడుగుల లోతులో టైటానిక్ నౌక శకలాలున్నాయి. వాటిని చూసేందుకు గత ఆదివారం న్యూపౌండ్ ల్యాండ్ నుంచి మినీ జలాంతర్గామి బయల్దేరింది.
పాకిస్తాన్ బిలియనీర్ షెహజాదా దావూద్, ఆయన కుమారుడు సులేమాన్ ఈ జలాంతర్గామిలో వెళ్ళారు.
Also Read: వైరల్ వీడియో.! జింకలు పాముల్ని తింటాయా.?
బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఫ్రెంచ్ మాజీ నావికా అధికారి పాల్ హెన్రీ, ఓషన్ గేట్ వ్యస్థాపకడు స్టాక్టన్ రష్ ఈ జలాంతర్గామిలో ప్రయాణించిన ఇతరులు.
రిమోట్ ఆధారిత వెహికల్ ద్వారా టైటాన్ శకలాల్ని గుర్తించారు.