Tollywood Celebrities Divorce.. ఎవరి కాపురం అయినా పచ్చగా కనిపిస్తే ఓర్వలేనితనం కొంతమందిలో వుంటుంది.
గాసిప్స్ కాలమ్స్ పుణ్యమా అని, సినీ కుటుంబాలు ఎప్పుడు విడిపోతాయా.? అని ఎదురు చూడటం మీడియా రంగంలో సర్వసాధారణమైపోయింది.
సమంత (Samantha), నాగచైతన్య (Akkineni Naga Chaitanya) విడిపోతున్నారట.. అనే గాసిప్స్ బయటకు వచ్చాయి. విడిపోయారు. మంచు మనోజ్ విషయంలోనూ ఇలాగే గాసిప్స్ వచ్చాయి.. అక్కడా విడాకుల వ్యవహారం చోటు చేసుకుంది.
కొన్ని నిజాలు అవుతుంటే, మరిన్ని గాసిప్స్ పుట్టుకొస్తుంటాయ్ ఆటోమేటిక్‌గా.! దాంతో, చక్కగా సంసారం చేసుకుంటున్న సినీ జనాలూ ఈ గాసిప్స్ పట్ల తీవ్ర ఆందోళన చెందాల్సి వస్తోంది.
Tollywood Celebrities Divorce.. వాళ్ళు విడిపోతే, వీళ్ళకేంటి.?
తాజాగా, గాయకుడు హేమచంద్ర, ఆయన సతీమణి శ్రావణ భార్గవి విడిపోతున్నట్లుగా పుకార్లు వచ్చాయి. వీటిపై ఇరువురూ స్పందించారు, తాము విడిపోతున్నామంటూ వచ్చిన పుకార్లను ఖండించారు.

మరోపక్క, రామ్ పోతినేని (Ram pothineni) తన చిన్ననాటి స్నేహితురాల్ని పెళ్ళి చేసుకోబోతున్నాడంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఆయనా ఆ పుకార్లను ఖండించాడు.
ప్రభాస్ (Prabhas) పెళ్ళి విషయమై వచ్చే గాసిప్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రతిసారీ ప్రభాస్ కుటుంబం ఆ గాసిప్స్‌ని ఖండిస్తూ వస్తోంది. ఇది.. ఈ గాసిప్స్ వ్యవహారం ఓ ప్రసహనం.. ఇది ఆగేది కాదు.!
ప్రతి గాసిప్పుకీ స్పందించడమేంటి.? అని చాలామంది సెలబ్రిటీలు అనుకుంటుంటారు.
అక్కడే వస్తుంటుంది అసలు సమస్య. మౌనం అర్థాంగీకారమే.. అన్నట్టు, గాసిప్స్‌ని ఆధారంగా చేసుకుని కథనాలు పుట్టుకొచ్చేస్తుంటాయ్.
Also Read: అడివి శేష్ ఏదో ’కథ‘ చెప్తున్నాడు.. సన్నీలియోన్ వింటోందా.?
చివరికి, ఈ గాసిప్స్ ఆయా సెలబ్రిటీలకు పెద్ద తలనొప్పిగా మారిపోతాయ్. హెవీ డ్యామేజ్ జరిగాక, ఖండిస్తుంటారు. అన్నట్టు, ఈ గాసిప్స్‌తో పాపులర్ అయిన సెలబ్రిటీలూ లేకపోలేదండోయ్.!
కామెడీ కాదు, సీరియస్.! ఔను, సెలబ్రిటీలూ మనుషులే. వాళ్ళకీ వ్యక్తిగత జీవితాలుంటాయ్. అభిప్రాయ బేధాలొస్తే విడిపోవచ్చు.. ఇందులో వింతేముంది.?
మీడియాలో మాత్రం ఎంతమంది జీవితాల్లో తుపాన్లు, సునామీలు రావడంలేదు.? సెలబ్రిటీల మీద వార్తలకి వ్యూయర్స్ ఎక్కువ. అదే అతి పెద్ద సమస్యగా మారిపోయినట్టుంది.