Tooth Pari Telugu Review.. ఔను, ఇదొక దెయ్యం ప్రేమకథ.! దెయ్యమంటే మామూలు దెయ్యం కాదు.! రాత్రుళ్ళు మాత్రమే సంచరించి, మనుషుల రక్తాన్ని పీల్చే పిశాచి.
‘టూత్ పరి’ పేరుతో వచ్చిందో వెబ్ సిరీస్.! మానవుల రక్తాన్ని పీల్చే దెయ్యం, ఓ మనిషిని ప్రేమిస్తే.? అదే ఈ ‘టూత్ పరి’ కథ.!
నటీనటుల్లో సీనియర్ నటి రేవతి తప్ప, తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఇంకో నటి లేదా నటుడు.. ఎవరూ లేరిందులో.!
కానీ, తెలుగులోనూ అందుబాటులో వుందిది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ‘టూత్ పరి’ అత్యంత వేగంగా వీక్షకుల్ని.. అంతే అమితంగా ఆకట్టుకుంటోంది.
Tooth Pari Telugu Review.. మంచి దెయ్యాల కథ.!
ముందే చెప్పుకున్నాం కదా.. ఇదొక ప్రేమ కథ.! నిజానికి, ఇందులో దెయ్యాలన్నీ మంచివే.! పగలంతా ఓ అండర్‌గ్రౌండ్‌లో దాక్కుంటాయ్. రాత్రయితే జనాల్లోకి వస్తాయ్.
ఏం.. దెయ్యాలైతే మాత్రం.. వాటికి ప్రేమ వుండకూడదా.?
డాక్టరుతో దెయ్యం ప్రేమలో పడితే ఏమవుతుంది.?
ప్రేమ ఓ వైపు, పగ ఇంకో వైపు.. ఆ దయ్యం ఛాయిస్ ఎటువైపు.?
దెయ్యాలతో లవ్వు.. మామూలుగా వుండదు మరి.!
కాస్తంత కామెడీ.. ఇంకాస్త సీరియస్.. ఒకింత రో..మాంటిక్ టచ్.!
కొత్తగా ట్రై చేశారు.. హిట్టా.? ఫట్టా.? ‘టూత్ పరి’ మీద ఓ లుక్కెయ్యండి మరి.!
Mudra369
జనాల్లోకి వచ్చినా ఎవర్నీ చంపకూడదన్న నిబంధన ఒకటి వుంటుంది. కేవలం తమకు కావాల్సిన కొంత రక్తాన్ని మాత్రమే సేకరిస్తాయ్.
అన్నట్టు, వీటికి రక్తాన్ని అవసరమైన మేర సప్లయ్ చేసే సప్లయర్ కూడా ఒకరుంటారు. ఆ ‘స్టాక్’ రక్తం బోర్ కొట్టిన దెయ్యాలు మాత్రమే రహస్యంగా జనాల్లోకి వస్తారు.
అలా వచ్చే ఓ దయ్యం, అనూహ్యంగా దంతాన్ని (పొడుగాటి దంతం.. పీక కొరికి.. రక్తాన్ని పీల్చడానికి అనువుగా వుండేది..) కోల్పోతుంది.

ఆ దంతాన్ని సరిచేసుకోవడం కోసం డెంటిస్ట్‌ని సంప్రదిస్తుంది ఆ గ్లామరస్ దెయ్యం. అంతే, ఆ డాక్టరుతో ప్రేమలో పడుతుంది.
మరోపక్క, సదరు గ్లామరస్ దెయ్యం, తన స్నేహితురాల్ని కోల్పోతుంది.. ఆ ఇంకో దయ్యాన్ని చంపేస్తుంది ఓ ముసలి టీమ్.! ఆ టీమ్ పేరు ఖాట్మండూస్.
ఆ ఖాట్మండూస్ టీమ్ లీడర్ రేవతి.! తన స్నేహితురాల్ని చంపేసిన వారిని అంతమొందించడం కోసం ప్రయత్నిస్తుంటుంది గ్లామరస్ దెయ్యం.
ప్రేమ.. పగ.. చివరికి ఏమయ్యింది.?
ఓ వైపు ప్రేమ, ఇంకో వైపు పగ.. ఆ రక్త పిపాసి.. ప్రేమని గెలిపించుకుందా.? పగ సాధించిందా.? అన్నది తెరపైనే చూడాలి.
కాస్తంత ఫన్.. కాస్తంత రొమాన్స్.. ఒకింత ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంటుంది. భయానికి తావు లేకుండా తెరకెక్కించిన దెయ్యం ప్రేమ కథ ఇది.
Also Read: ‘బ్లూ’ టిక్ పోయిందే.! సెలబ్రిటీల ఆర్తనాదాలు.!
గ్లామరస్ దెయ్యం రుమీ పాత్రలో నటించిన తాన్యా చాలా బాగా చేసింది. సీనియర్ నటి రేవతి సంగతి సరే సరి. యంగ్ డెంటల్ డాక్టర్ శాంతను మహేశ్వరి కూడా చాలా బాగా చేశాడు.
టేకాఫ్, ల్యాండింగ్.. అన్నీ పక్కగా సెట్ అయ్యాయి ‘టూత్ పరి’ వెబ్ సిరీస్‌కి సంబంధించి. టైమ్ చూసుకుని ఓ లుక్కేయండి.. ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది.!