Home » ‘టాక్సిక్’ ఎందుకు భయపడింది.? వాయిదాకి యుద్ధమే కారణమా.!

‘టాక్సిక్’ ఎందుకు భయపడింది.? వాయిదాకి యుద్ధమే కారణమా.!

by hellomudra
0 comments
Geetu Mohandas Toxic Yash

Toxic Movie Postponed.. యష్ హీరోగా తెరకెక్కిన ‘టాక్సిక్’ చివరి నిమిషంలో విడుదల వాయిదా పడింది. జూన్ 4న సినిమా రిలీజ్ అవుతుందని అధికారిక ప్రకటన వచ్చింది.

వాస్తవానికి ‘టాక్సిక్’ సినిమాని మార్చి 19న విడుదల చేద్దామనుకున్నారు. ‘టాక్సిక్’ విడుదల నేపథ్యంలో కొన్ని తెలుగు సినిమాలు తమ రిలీజ్ డేట్‌ని అటూ ఇటూ మార్చుకున్నాయ్ కూడా.

కానీ, ‘టాక్సిక్’ విడుదల వాయిదా పడింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ద వాతావరణం కారణంగా ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Toxic Movie Postponed.. లాస్ట్ మినిట్ పోస్ట్‌పోన్డ్.!

నిజమే.! ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేద్దామనుకున్న చిత్ర యూనిట్‌కి కొత్త తలనొప్పుల్ని తెచ్చి పెట్టింది.

రిస్క్ ఎందుకులే.! అన్న కోణంలో ఈ సినిమాని వాయిదా వేశారన్నది ఓ వెర్షన్. అదే సమయంలో ‘టాక్సిక్’ విషయమై మేకర్స్ చిన్న చిన్న అనుమానాలతో వున్నారనీ, ఆ కారణంగానే చివరి నిమిషంలో సినిమాని వాయిదా వేశారనీ తెలుస్తోంది.

కొన్ని సినిమాల రిలీజ్‌లు చివరి నిమిషంలో వాయిదాలు పడడం ఇటీవల కాలంలో తరచూ చూస్తున్నాం. ఆ కోవలోకి ఇప్పడు ‘టాక్సిక్’ కూడా చేరిపోయింది.

అనుమానాలెన్నో.!

కైరా అద్వానీ, నయన తార, రుక్మిణీ వసంత్, హ్యూమా ఖురేషి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. గీతూ మోహన్ దాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహస్తున్నారు.

మార్చి 19న ‘దురంధర్ 2’ విడుదల కావల్సి వుంది. ఆ సినిమా రిలీజ్ పైనా అనుమానాలున్నాయ్.

మార్చి 19న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వస్తే ఎలా వుంటుంది.? అన్న కోణంలో చర్చ నడుస్తోంది. ఈ సినిమాని 26న విడుదల చేస్తామని మైత్రీ మూవీ మేకర్స్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group