Trendy Glamorous Hand Bags.. తాము ధరించే దుస్తులు.. వేసుకునే మేకప్.. వాట్ నాట్.! దేంట్లో అయినా, ట్రెండ్ సెట్ చెయ్యాలనే అనుకుంటారు ముద్దుగుమ్మలు.!
కాదేదీ ట్రెండ్ సెట్ చేయడానికి అనర్హం.! ఔను, హై హీల్స్ అయినా.. ముక్కు పుడకలైనా.. ఏదైనా ప్రత్యేకంగా వుండాల్సిందే.!
మరి, హ్యాండ్ బ్యాగ్ సంగతేంటి.? ఆ విషయంలో ‘తగ్గేదే లే’ అంటారు అందాల భామలు.! వందలు, వేలు కాదు.. లక్షలు వెచ్చించేస్తుంటారు.!
వజ్రాలు పొదిగిన హ్యాండ్ బ్యాగులైతే కోట్లల్లో ధర పలికినా ఆశ్చర్యమేముంది.? నిజంగా, అవి వాడుకోవడానికే పనిచేస్తాయా.? అంటే, ఎక్కువ శాతం ‘షో’ కోసమే పరిమితమవుతాయ్.!
Trendy Glamorous Hand Bags.. వజ్రాలుగానీ పొదగలేదు కదా.!
ఫొటోలో చూస్తున్నారు కదా.! అందాల భామ కాజల్ అగర్వాల్, ట్రెండీ హ్యాండ్ బ్యాగ్‌తో ఎలా సందడి చేస్తోందో.!
అందాల చందమామ కాజల్ అగర్వాల్‌నే ఆ హ్యాండ్ బ్యాగ్ గ్లామర్ డామినేట్ చేస్తున్నట్టుంది కదా.! ఛా.. ఆ చాన్స్ అయితే లేదు లెండి.!

పెళ్ళయినా.. ఓ బిడ్డకు తల్లయినా.. తరగని గ్లామర్ కాజల్ అగర్వాల్ సొంతం. ట్రెండీగా వుండడం కాజల్ అగర్వాల్‌కి గ్లామర్‌తో పెట్టిన విద్య.!
ఇంతకీ, కాజల్ చేతిలో వున్న అందమైన హ్యాండ్ బ్యాగ్ ఖరీదెంత.? ఆల్రెడీ నెటిజన్లు వెతికేస్తున్నారు దాని ధర కోసం.!
షో టైమ్.!
సాధారణంగా ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్.. అవసరమైన వస్తువుల్ని వుంచుకోవడానికి పనికిరావు. జస్ట్ అలా చేతిలో వుంటాయంతే.!
స్టైలింగ్ కోసం అనుకోవచ్చు.! చేతిలో హ్యాండ్ బ్యాగ్ వుంటే, ఆ కాన్ఫిడెన్స్ వేరు.. ఆ జోరు, హుషారు వేరు.. అనుకుంటారు కొందరు.
Also Read: ప్చ్.! ట్విట్టర్ పిట్ట ఎగిరిపోయిందే.!
ఓ చేత్తో కాస్ట్యూమ్‌ని సరిచేసుకుంటూ.. ఇంకో చేత్తో ఆ బ్యాగుని అలా అలా అందరికీ కనిపించేలా చూపిస్తూ.. ఆ కిక్కే వేరప్పా.!
కొంతమందికైతే, ఆ హ్యాండ్ బ్యాగ్ కారణంగా సరైన నడక తీరు వస్తుందట. అది లేకపోతే, నడక తీరు అధ్వాన్నంగా మారిపోతుందట. ఆశ్చర్యకరంగా వున్నా.. ఇదీ నిజమే.!
బడా పార్టీల్లోనే కాదు.. మామూలుగా కూడా.. మహిళలు ఈ తరహా జస్ట్ ఫర్ షో అన్నట్టుగా ఉపయోగం లేని హ్యాండ్ బ్యాగుల్ని ‘ట్రెండీ స్టైల్’ కోసం వాడుతున్నార్లెండి.