Trisha Krishnan Honeymoon.. ఓ సల్మాన్ ఖాన్.. ఓ ప్రభాస్.. ఓ త్రిష.! పెళ్ళి ప్రస్తావన వస్తే, ఇలా డిస్కషన్స్ జరుగుతుంటాయ్.!
త్రిష, తెలుగులోనే కాదు తమిళ సినీ పరిశ్రమలోనూ ఒకప్పుడు అగ్ర హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఇప్పటికీ, ఆమె స్టార్‌డమ్ అలానే వుందనుకోండి.. అది వేరే సంగతి.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. ఫిమేల్ కేటగిరీలో.. అంటే, త్రిష కృష్ణన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంటుంది.
గతంలో పెళ్ళి పీటలదాకా వెళ్ళిందిగానీ..
త్రిషకి గతంలో ఎంగేజ్మెంట్ జరిగింది.. ఆ తర్వాత అనూహ్యంగా, ఆ బంధం.. పెళ్ళి పీటలెక్కకముందే అటకెక్కిపోయింది.
అంతే, ఇక అప్పటి నుంచి త్రిష పెళ్ళి ప్రయత్నాలేమీ చేయలేదు. సినిమాల్లో బిజీ అయిపోయింది. సెలక్టివ్‌గానే సినిమాలు చేస్తున్నా, ప్రెస్టీజియస్ ప్రాజెక్టులే దక్కుతున్నాయామెకి.
Trisha Krishnan Honeymoon.. ఈసారి హనీమూన్ ప్లాన్ చెయ్యండి..
తాజాగా, త్రిషకి ఓ వ్యాపార వేత్తతో పెళ్ళంటూ గాసిప్స్ గుప్పుమంటున్నాయి. ఈ గాసిప్స్‌పై సోషల్ మీడియా వేదికగా స్పందించింది.
ఇంకెందుకు ఆలస్యం, హనీమూన్ ఎక్కడన్నది కూడా మీరే ప్లాన్ చేసెయ్యండి.. అంటూ, సోషల్ మీడియా వేదికగా త్రిష, సెటైర్ వేసింది పెళ్ళి గాసిప్స్‌పై.
దాంతో, అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. తనపై వచ్చే నెగెటివిటీపై అరుదుగా స్పందిస్తుంటుంది త్రిష. కానీ, ఆమె స్పందన.. ఇదిగో, ఈ రేంజ్‌లోనే వుంటుంది.
సినిమాల్లో బిజీ బిజీ..
పెళ్ళి గాసిప్స్ సంగతి పక్కన పెడితే, త్రిష క్షణం తీరిక లేకుండా సినిమాలతో బిజీగా వుంది. మొన్నామధ్యన కమల్‌హాసన్‌తో ఓ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం, మెగాస్టార్ చిరంజీవితో తెలుగులో ఓ సినిమా చేస్తోంది. ఓ బాలీవుడ్ ప్రాజెక్టుకి కూడా ఇటీవలే సైన్ చేసింది. చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి త్రిషకి.
‘ప్రస్తుతం పెళ్ళి ఆలోచన లేదు. కెరీర్ మీదనే ఫోకస్ వుంది. మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే, పెళ్ళి గురించి ఆలోచిస్తాను..’ అంటూ ఆ మధ్య పెళ్ళి ప్రస్తావనపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది త్రిష.
