Trivikram Srinivas BRO.. తాను దర్శకత్వం వహించే సినిమాల కంటే, పవన్ కళ్యాణ్ సినిమాలతోనే ఎక్కువగా హాట్ టాపిక్ అవుతున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మధ్య.
‘భీమ్లా నాయక్’ సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన మార్పుల సంగతి తెలిసిందే. ఆ మార్పులు ‘భీమ్లా నాయక్’ విజయానికి ఏ రేంజ్‌లో తోడ్పడ్డాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇప్పుడు ‘బ్రో’ సినిమాకీ త్రివిక్రమ్ రచనా సహకారం అందించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ చేసిన కీలక మార్పులు ఈ సారి కూడా ఖచ్చితంగా వర్కవుట్ అవుతాయని అంటున్నారు.
Trivikram Srinivas BRO.. లేకున్నా.. అక్కడే వున్నట్లే.!
ముఖ్యంగా ప్రధాన పాత్రధారి వయసు ఒరిజినల్‌లో దాదాపు 50 ఏళ్లయితే ఇందులో 25 ఏళ్ల కుర్రోడు. ఇదే ‘బ్రో’ అన్ని వర్గాలను అలరించదగ్గ సినిమా అని చెప్పేందుకు అత్యంత కీలకమైన మార్పు.

ఇదొక్కటే కాదు, ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అన్నీ తానే అయ్యి వ్యవహరించాడు గురూజీ. అందుకే డైరెక్టర్ సముద్రఖని, త్రివిక్రమ్‌కి అన్న స్థానాన్ని, తండ్రి స్థానాన్ని ఇచ్చి తన గౌరవాన్ని చాటుకున్నాడు.
ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో త్రివిక్రమ్ కనిపించకపోయినా ఆయన పేరు మార్మోగిపోయింది. ఆ క్షణం ఆయన అక్కడ లేకున్నా ఆయన స్పేస్ అలాగే వుంది.
ఇదంతా చూస్తుంటే, త్రివిక్రమ్ ‘బ్రో’ కోసం చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదని అర్ధమవుతోంది. ఇంతకీ ‘బ్రో’ కోసం త్రివిక్రమ్ ఇంకెలాంటి మార్పులు చేశాడు.? అది తెలియాలంటే ఇంకొద్ది గంటలు ఆగితే సరిపోతుంది.
మరికొద్ది గంటల్లోనే ‘బ్రో’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పుడెప్పుడు ‘బ్రో’ సినిమాని చూడాలా.? అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు.
Also Read : Tillu Square Anupama Parameswaran: ఫుల్ షో! వితౌట్ టిక్కెట్!
మామా అల్లుళ్లు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ సినిమా కావడం ‘బ్రో’పై క్యూరియాసిటీని రెట్టింపు చేస్తోంది.
ఇద్దరు ముద్దుగుమ్మలు కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ అందాల భామ ఊర్వశి రౌతెలా స్పెషల్ సాంగ్ ఈ సినిమాకి మరో హైలెట్.