Table of Contents
Trivikram Srinivas Hat trick Heroines ఒకే హీరోయిన్‌ని వరుసగా ఒకే డైరెక్టర్ సినిమాలో చూస్తే ఎలా వుంటుంది.? కాస్త బోర్ అనిపిస్తుంది. కానీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాల్లో హీరోయిన్లను వరుసగా రిపీట్ చేసినా అస్సలు బోర్ కొట్టదు. అందుకు కారణం లేకపోలేదు.
ఆయన తన సినిమాల్లో హీరోయిన్ పాత్రలను స్ట్రాంగ్‌గా డిజైన్ చేయడంతో పాటు, ఆయా పాత్రల్లో వేరియేషన్ కూడా అదేరకంగా చూపిస్తుంటాడు. సో, ఆయన సినిమాల్లో వరుసగా హీరోయిన్లను రిపీట్ చేసినా బోర్ కొట్టించరు. అయితే ఈ అవకాశం చాలా అరుదుగా కొంతమంది ముద్దుగుమ్మలకు మాత్రమే దక్కుతుంది.
Trivikram Srinivas Hat trick Heroines సమంత, త్రివిక్రమ్ హ్యాట్రిక్: అంతకు మించి
అలా త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ అందుకున్న హీరోయిన్లలో సమంతది మొదటి స్థానంగా చెప్పుకోవచ్చు. ‘అత్తారింటికి దారేది’ సినిమాతో త్రివిక్రమ్ – సమంత కాంబినేషన్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా కోసం కూడా సమంతనే హీరోయిన్‌గా తీసుకున్నాడు త్రివిక్రమ్. ఇదీ హిట్టు బొమ్మే.
ముచ్చటగా మూడో సారి ‘అ ఆ’ సినిమాలోనూ సమంతనే రిపీట్ చేశాడు. పక్కా హిట్ ఈ సినిమా కూడా. బ్యాక్ టు బ్యాక్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సమంత హ్యాట్రిక్ కొట్టిన సినిమాలివి. సక్సెస్‌తో పాటు, నటిగా సమంతకు మంచి గుర్తింపు తెచ్చిన సినిమాలివి.
లేడీ బాస్ ఇమేజ్: త్రివిక్రమ్ వల్లే
‘అరవింద సమేత’ సినిమాతో పూజా హెగ్దే – త్రివిక్రమ్ కాంబో సెట్టయ్యింది. హీరోయిన్ సెంట్రిక్ టైటిల్ పెట్టి రిలీజ్‌కి ముందే హీరోయిన్ క్యారెక్టర్‌కి వెయిట్ పెంచేశాడీ సినిమాలో త్రివిక్రమ్. ఆ తర్వాత ‘అల వైకుంఠ పురములో..’ అంటూ ‘అ’ సెంటిమెంట్‌ని కంటిన్యూ చేస్తూ, పూజా హెగ్దేనే హీరోయిన్‌గా రిపీట్ చేశాడు.

హీరోయిన్స్ రిపీట్ విషయంలో త్రివిక్రమ్ అభిమానులు కొందరు అసహనం వ్యక్తం చేశారు కూడా. కానీ, సినిమా సూపర్ హిట్ అయ్యింది. సెంటిమెంట్ వర్కవుట్ అయ్యింది.
ఇక అంతే.! ఏం మొహమాటపడకుండా తన తర్వాతి సినిమాకీ పూజానే హీరోయిన్ అని ఫిక్సయిపోయాడు త్రివిక్రమ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
బెల్లీ బ్యూటీ జస్ట్ మిస్డ్ ది హ్యాట్రక్ ఛాన్స్
ఇక బెల్లీ భామ ఇలియానా – త్రివిక్రమ్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హ్యాట్రిక్‌ని జస్ట్‌లో మిస్ చేసుకుంది ఇలియానా. ‘జల్సా’, ‘జులాయి’ సినిమాల్లో ఇలియానాని హీరోయిన్‌గా తీసుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
Also Read: మాళవికకి మండింది.! మంట పెట్టిందెవరంటే.!
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కాకపోయినా, రెండూ సూపర్ డూపర్ హిట్ సినిమాలు వీరిద్దరి కాంబినేషన్లో ఇవి. ఇక మూడో సినిమా కూడా రావల్సి వుంది ఈ కాంబోలో. అయితే, ఇలియానాతో త్రివిక్రమ్‌కి గొడవల కారణంగా ఆ ఛాన్స్ మిస్ చేసుకుందనే ప్రచారం అప్పట్లో ఊదరగొట్టింది.
కాదు, కాదు, త్రివిక్రమ్ శ్రీనివాసే బెల్లీ బ్యూటీని బ్యాన్ చేసేశాడు.. అనే ప్రచారం కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఏదేమైతేనేం, త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ (Trivikram Srinivas Hat trick Heroines) కొట్టే ఛాన్స్ అయితే తృటిలో మిస్ చేసుకుంది గోవా బ్యూటీ ఇలియానా.