Trolling Against Sanatana Dharma.. దేశ ప్రధాని ఒకరు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకొకరు. ఉప ముఖ్యమంత్రి ఇంకొకరు. ప్రముఖ దేవాలయాన్ని సందర్శించారు ఈ ముగ్గురూ.!
సాధారణంగా, దేవాలయాల్లోకి ప్రవేశించాలంటే, సంప్రదాయ దుస్తుల్నే ధరించాల్సి వుంటుంది.
సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా, అన్ని దేవాలయాలూ, సంప్రదాయ వస్త్ర ధారణ తప్పనిసరి.. అని చెబుతున్నాయి.
దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు, సంప్రదాయ వస్త్రాలను ధరించడమన్నది కనీసపాటి ధర్మం.! కానీ, చాలామంది దీన్ని లెక్క చేయడంలేదు.
Trolling Against Sanatana Dharma.. ట్రోలింగ్‌పై చర్యలేవీ.?
ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన శ్రీశైలం శ్రీ భ్రమరాంభ సమేత శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయాన్ని సందర్శించారు.
ఏపీ పర్యటనలో భాగంగా ప్రధానికి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన సీఎం, డిప్యూటీ సీఎం.. ఆయన వెంట, శ్రీశైలం వెళ్ళారు.
సాధారణ భక్తుల తరహాలోనే ముగ్గురూ సంప్రదాయ వస్త్రధారణలో వెళ్ళి, దైవ దర్శనం చేసుకున్నారు. ఇదే, కొంతమంది ‘అన్య మతస్థులైన’ రాజకీయ నాయకులు, పార్టీలకు నచ్చట్లేదు.!
అంతే, సోషల్ మీడియా వేదికగా బరితెగింపు మొదలైంది. ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం సంప్రదాయ వస్త్రధారణపై ట్రోలింగ్ షురూ అయ్యింది.
పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నట్లు.?
రాష్ట్ర హోం శాఖ అలాగే, కేంద్ర హోం శాఖ.. ఇలాంటి ట్రోలింగ్ పట్ల సీరియస్‌గా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా వుంది.
Also Read: డాలర్ డ్రీమ్స్ వద్దే వద్దు.! మన భారతమే ముద్దు.!
సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ సంప్రదాయ వస్త్రధారణతో దైవ దర్శనం చేసుకోవడాన్ని తప్పు పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే.
రాజకీయాలన్నాక విమర్శలు సహజమే కావొచ్చు. కానీ, మతపరమైన కోణంలో విమర్శలు అస్సలేమాత్రం సమర్థనీయం కాదు.
