తెలుగు సినిమాకెంత కష్టమొచ్చింది.? కాదు కాదు, పెద్ద సినిమాలకెంత కష్టమొచ్చింది.? కష్టం ఒకటే ఏ సినిమాకైనా.! ఎలా మాట్లాడుకోవాలో అర్థం కావడంలేదు ప్రస్తుత పరిస్థితుల గురించి తెలుగు సినీ పరిశ్రమలో ఎవరికైనా. కరోనా మొదటి వేవ్ కారణంగా వచ్చిన సమస్య ఓ రకమైనదైతే, రెండో వేవ్ సమయంలో తలెత్తుతున్న సమస్య (Tuck Jagadish Nani Hands Up) ఇంకోరకమైనది.
నాని హీరోగా తెరకెక్కిన ‘టక్ జగదీష్’ సినిమా ఎప్పుడో విడుదలవ్వాల్సి వుంది. కానీ, కరోనా నేపథ్యంలో సినిమా విడుదల ఆలస్యమయ్యింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ సినిమాని థియేటర్లలోనే విడుదల చేయాలన్న ఆలోచనతో చిత్ర నిర్మాతలు, ఓటీటీ నుంచి వచ్చిన ఆపర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకోలేకపోయారు.
Also Read: వెండితెరకు ‘ఓటీటీ’ వణుకు.. తప్పదు, సర్దుకుపోవాల్సిందే.!
కానీ, పరిస్థితులు అనుకూలించడంలేదు. కరోనా సెకెండ్ వేవ్ తీవ్రత తగ్గి, థియేటర్లు తెరచుకున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా కొనసాగుతున్న కోవిడ్ 19 కర్ఫ్యూ ఆంక్షలు, అమెరికాలో పెరుగుతున్న కేసులతో ఓవర్సీస్ మార్కెట్ పరంగా తలెత్తే ఇబ్బందులు.. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని, ఓటీటీ వైపే మొగ్గు చూపాల్సిన పరిస్థితి ఏర్పడింది ‘టక్ జగదీష్’ సినిమాకి.
ఈ విషయమై కాస్త ఉద్వేగభరితమైన లేఖ ఒకటి విడుదల చేశాడు హీరో నాని (Natural Star Nani) సోషల్ మీడియా వేదికగా. అందులో అన్ని విషయాల్నీ ప్రస్తావించాడు. నిర్ణయాన్ని చిత్ర నిర్మాతలకే వదిలేస్తున్నట్లు ప్రకటించాడు. దాంతో, నాని అభిమానులు కొంత ఆందోళన చెందారు, తమ అభిమాన హీరోని చివరికి అర్థం చేసుకున్నారు.
గతంలో ‘వి’ సినిమా విషయంలోనూ నాని అండ్ టీమ్ చివరి వరకు పోరాడినా, ఓటీటీ డైరెక్ట్ రిలీజ్ చేయక తప్పలేదు. ఇప్పుడూ అదే పరిస్థితి ఎదురయ్యింది.. ‘టక్ జగదీష్’ కూడా (Tuck Jagadish Nani Hands Up) ఓటీటీ వైపే చూస్తోంది. మరి, ‘శ్యామ్ సింగా రాయ్’ సినిమా పరిస్థితి ఏమవుతుందో.!