Table of Contents
TVK Vijay Stampede Karur.. తమిళనాడులో తొక్కిసలాట చోటు చేసుకుంది. దాదాపు 38 మంది సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయినవారిలో, పసి పిల్లలూ వున్నారు.
అసలు, పసిపిల్లలు ఎందుకు, రాజకీయ సభ కోసం వెళ్ళినట్లు.? వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులే, ఆ సభకు తీసుకెళ్ళారు.!
రాజకీయ సభలకు, జనాల్ని తరలించడం.. అనేది చాలాకాలంగా వస్తున్న ఆనవాయితీ. డబ్బులు ఇచ్చి జనాల్ని తరలించడం రాజకీయ పార్టీల జన్మ హక్కు అయిపోయింది.
TVK Vijay Stampede Karur.. విజయ్ సినిమాటిక్ పొలిటికల్ ఫాలోయింగ్..
నో డౌట్, విజయ్ అంటే తమిళనాడులో సూపర్ స్టార్. తిరుగులేని ఫాలోయింగ్ వున్న ప్రముఖ సినీ నటుడు విజయ్. ఇటీవల, టీవీకే అనే రాజకీయ పార్టీని స్థాపించాడు విజయ్.
తమిళనాడులో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ ‘టీవీకే’ పోటీ చేయనుంది. ఈ క్రమంలో, వీకెండ్ రాజకీయ యాత్రలు ప్లాన్ చేశాడు టీవీకే అధినేత విజయ్.
ఈ క్రమంలో ఉదయం ఓ బహిరంగ సభలో పాల్గొన్న విజయ్, సాయంత్రం మరో బహిరంగ సభలో పాల్గొన్నాడు. సాయంత్రం జరిగిన బహిరంగ సభలోనే తొక్కిసలాట జరిగింది.
కరూర్ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ క్రమంలో పెద్దయెత్తున అలజడి బయల్దేరింది. అది మరిం తీవ్రమైన తొక్కిసలాటకి కారణమయ్యింది.
క్రికెట్ తొక్కిసలాట తర్వాత..
కొద్ది రోజుల క్రితం, బెంగళూరులో ఓ తొక్కిసలాట జరిగింది. ఐపీఎల్లో బెంగళూరు జట్టు విజయం సాధించిన దరిమిలా, నిర్వహించిన ర్యాలీ, ఆ తొక్కిసలాటకి కారణమయ్యింది.
తొలిసారి టైటిల్ గెలిచిన ఆనందంలో, బెంగళూరు టీమ్ అత్యుత్సాహం ప్రదర్శించింది. పోలీసులూ, భద్రతా చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారు.
వెరసి, ఆ తొక్కిసలాటలో పలువురు సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. ఆ కేసు ఇంకా నడుస్తూనే వుంది. దోషులకు శిక్ష ఎప్పుడు పడుతుందో ఏమో.!
పుష్ప అల్లు అర్జున్ అరెస్ట్..
‘పుష్ప-2’ రిలీజ్ సందర్భంగా రికార్డు స్థాయిలో ప్రీమియర్ షోలు వేస్తే, ఓ ప్రీమియర్ షో చూసేందుకు వెళ్ళిన అల్లు అర్జున్, అక్కడ తొక్కిసలాటకి కారణమయ్యాడు.
ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందడం, ఆమె తనయుడు తీవ్ర అస్వస్థతకు గురవడంతో, కేసు నమోదు చేసిన పోలీసులు, అల్లు అర్జున్‌ని అరెస్టు చేశారు.
మరి, టీవీకే విజయ్ విషయంలో.. తమిళనాడు ప్రభుత్వం ఏం చేయబోతోంది.? 38 మంది మృతికి కారణమైన విజయ్‌ని తమిళనాడు ప్రభుత్వం అరెస్టు చేస్తుందా.? లేదా.?
Also Read: లక్కీ బాంబూ (వెదురు) మీ ఇంట్లో వుందా.?
దారుణమైన విషయమేంటంటే, ‘వుయ్ స్టాండ్ విత్ విజయ్’ అంటూ, కొందరు సోషల్ మీడియా వేదికగా వెకిలితనం ప్రదర్శిస్తున్నారు.
రాజకీయం అంటే, ప్రజా సేవ.! అంతేగానీ, రాజకీయ జన సమీకరణ పేరుతో, ప్రజల్ని చంపేస్తే.. అది ప్రజా సేవ ఎలా అవుతుంది.? ఈ ఘటనకి నైతిక బాధ్యత తీసుకోవాల్సింది విజయ్.
