Corona Virus Mask.. ఎద్దు ఈనిందిరా.. అనగానే, దూడని కట్టెయ్యడం మనోళ్ళకి అలవాటే.! దీని గురించి తర్వాత చర్చించుకుందాం.. ముందైతే కోవిడ్ గురించి మాట్లాడుకుందాం.
కోవిడ్ పాండమిక్ మళ్ళీ విజృంభించబోతోందట.! ఇదిప్పుడు ఇంకోసారి భయపెడుతోన్న అంశం. దేశంలో కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి.
రోగం వస్తే మనిషి ఛస్తాడో లేదోగానీ.. మెడికల్ మాఫియా దెబ్బకి మాత్రం చచ్చి బతకాల్సిందే.. బతికి చావాల్సిందే.!
Mudra369
కొత్త వేరియంట్ ఒకింత వేగంగానే విస్తరిస్తోందిట. లక్షణాలూ భిన్నంగా వుంటున్నాయట. ఎవర్ని కదిలించినా, ‘జలుబు.. జ్వరం.. కోవిడ్ వచ్చేసిందనే అంటున్నారు.
Corona Virus Mask.. మళ్ళీ ఈ పైత్యమేంటి.?
భారతదేశంలో.. జలుబు, జ్వరం అనేవి సర్వసాధారణమైన విషయాలు. ‘జలుబుకి మందేస్తే, వారం రోజుల్లో తగ్గుతుంది.. మందు వెయ్యకపోతే ఏడు రోజుల్లో తగుతుంది..’ అంటుంటారు సరదాగా.!
కానీ, ఎప్పుడైతే కోవిడ్ పాండమిక్ (Covid 19 Pandemic) షురూ అయ్యిందో.. జలుబు, జ్వరం అనగానే భయపడాల్సిన దుస్థితి.

మాస్క్ ధరించడం అనేది కోవిడ్ తర్వాత ఓ ‘అలవాటు’గా మారిన మాట వాస్తవం. కోవిడ్ (Corona Virus) అనే కాదు, సాధారణ డస్ట్ అలర్జీస్ నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది మాస్క్.
అడ్డగోలుగా అమ్మేస్తున్నారు..
బయటకు వెళితే చాలు, చాలామంది మాస్క్‌తో కనిపిస్తున్నారు. అయితే, ఆ మాస్క్ వాడకం కూడా అత్యంత ఛండాలంగా తయారయ్యింది.
మాస్కుల (Covid 19 Mask) వ్యాపారం ఇప్పుడు బాగా వర్కవుట్ అవుతోంది. జనాల అవసరాన్ని క్యాష్ చేసుకోవడం వ్యాపారస్తుల లక్షణం.
Also Read: Nokia Connecting People.! నోకియా అంటే అదొక ఎమోషన్.!
డిజైనర్ మాస్కులు.. అత్యంత ఖరీదైన వ్యవహారం. కానీ, తప్పడంలేదు.! వెరసి, కోవిడ్ మాటేమోగానీ.. మాస్కుల వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలన్నట్టు తయారైంది.
ఇంకోపక్క, ఆసుపత్రులు అప్పుడే దోపిడీ షురూ చేసేశాయ్.! గతంలోలా భయం అయితే అంతగా అవసరంలేదుగానీ, ఆసుపత్రులు జనాన్ని భయపెట్టి దోచేస్తున్నాయ్.
ఇంతకీ, ప్రభుత్వాలేం చేస్తున్నాయ్.? షరామామూలుగానే చోద్యం చూస్తున్నాయ్.!