Twitter Blue Tick Celebrities అరరె.. నా బ్లూ టిక్ మాయమైపోయిందే.. ఇప్పుడు నేనేం చేయాలబ్బా.? ఈ ప్రశ్న చాలామంది అందాల భామల నుంచి సోషల్ మీడియా వేదికగా వ్యక్తమయ్యింది.
ట్విట్టర్ గురించే ఇదంతా.! నిధి అగర్వాల్, మెహరీన్ పిర్జాదా.. తదితర అందాల భామలే కాదు, క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా, ‘బ్లూ టిక్’ మాయమైపోవడంపై స్పందించాడు.
ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ చిక్కాక, చాలా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. కొన్నాళ్ళపాటు ఏకంగా ట్విట్టర్ పిట్ట కూడా మాయమైపోయిన సంగతి తెలిసిందే.

మరోపక్క, పనీ పాటా లేనోళ్ళు.. సెలబ్రిటీల ట్విట్టర్ అక్కౌంట్లకు ‘బ్లూ టిక్’ మాయమవడంపై చెత్త కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. జుగుప్సాకరంగానూ వ్యవహరిస్తున్నారు.
Twitter Blue Tick Celebrities.. సెలబ్రిటీ స్టేటస్ కూడా కొనుక్కోవాల్సిందే.!
ఎవరైనాసరే, ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్ కొనుక్కోవచ్చన్నమాట. జస్ట్ నెలకి సుమారుగా వెయ్యి రూపాయలు ఖర్చు చేయగలిగితే చాలు.. బ్లూ టిక్ వచ్చేసింది.
Also Read: Pooja Hegde.. ఎర్ర గులాబీలా మారిన ‘బుట్టబొమ్మ’.!
గతంలో అయితే, కేవలం సెలబ్రిటీలకు మాత్రమే బ్లూ టిక్ వుండేది. కొందరు ప్రొఫెషనల్స్ సైతం బ్లూ టిక్‌ని పొందేవారు.
ఇప్పుడలా కాదు, సబ్‌స్క్రైబ్ చేసుకోగలిగినవాడెవడికైనాసరే, ‘బ్లూ టిక్’ వచ్చేస్తుంది. సో, సెలబ్రిటీ.. అన్న మాటకే తావుండదన్నమాట ఇకపై ట్విట్టర్‌లో.!
కొసమెరుపేంటంటే.. కొందరు సెలబ్రిటీలు తమ తమ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా ట్వీట్లు చేసినా.. ‘అది ఫేక్ అకౌంట్’ అంటూ నెటిజన్లు కొందరు భావిస్తుండడం.