Urvashi Rautela Bro Kushi.. తొలి తెలుగు సినిమా ఇంకా విడుదల కాలేదుగానీ, ఈలోగా బ్యాక్ టు బ్యాక్ స్పెషల్ సాంగ్స్‌తో సందడి చేసేస్తోంది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా.
మొన్నీమధ్యనే ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవితో (Megastar Chiranjeevi) మాస్ స్టెప్పులేసింది ఓ స్పెషల్ సాంగ్‌లో.
తాజాగా, రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలోనూ స్పెషల్ సాంగ్ చేసేస్తోంది ఈ అందాల సుందరి.
Urvashi Rautela Bro Kushi.. ఎందుకంత ఖుషీ.!
సోషల్ మీడియా వేదికగా ఊర్వశి రౌతెలా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. దాని సారాంశమేంటంటే, ‘ఖుషీ’ సినిమా చూస్తోందట ఊర్వశి.
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఖుషీ (Kushi) తెలుగు సినీ పరిశ్రమలో వెరీ వెరీ స్పెషల్ మూవీ. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందా సినిమా అప్పట్లో.
‘బ్రో’ (Bro The Avatar) పేరుతో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తోన్న సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఊర్వశి రౌతెలా పేరు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

సరిగ్గా ఈ తరుణంలోనే తాను ‘ఖుషీ’ సినిమా చూస్తున్నానంటూ సోషల్ మీడియాలో ట్వీటేసింది ఊర్వశి.
అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు పవన్ కళ్యాణ్..
సో, చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ కోసం స్టెప్పులు ఇరగదీసిన ఊర్వశి (Urvashi Rautela), పవన్ కళ్యాణ్‌తో ‘బ్రో’ మూవీ కోసం స్టెప్పులు వేయబోతున్నట్టేనని అనుకోవాలేమో.!
Also Read: Sobhita Dhulipala.. అవేమీ నాకు సంతృప్తినివ్వలేదు.!
పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) – సాయి ధరమ్ తేజ్ (Supreme Hero Sai Dharam Tej) కలిసి నటిస్తోన్న ‘బ్రో’ సినిమాకి సముద్రఖని దర్శకుడు.
అంతా బాగానే వుందిగానీ, సంపత్ నంది తెరకెక్కించిన ‘బ్లాక్ రోజ్’ (Black Rose) ఏమయ్యిందబ్బా.?
‘నా తప్పు ఏమున్నదబ్బా..’ అంటూ ఆ సినిమా కోసం ఊర్వశి చేసిన సాంగ్ మాత్రం.. ఇప్పటికీ యూ ట్యూబ్‌లో వ్యూస్ కొల్లగొడుతూనే వుంది.