Urvashi Rautela Cricket.. ఊర్వశి రౌతెలాకి ఏమయ్యింది.? ఆమె ఎందుకింతలా ట్రోలింగ్ ఎదుర్కొంటోంది.?
ఇండియా – పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన టీ20 క్రికెట్ మ్యాచ్‌ని తాజాగా ఆమె ప్రత్యక్షంగా వీక్షించడమే పెద్ద నేరమైపోయింది.!
ఎవరైనా క్రికెట్ మ్యాచ్ చూడాలనుకుంటే, టిక్కెట్ కొనుక్కుని మైదానంలో చూసేందుకు అవకాశం వుంది. మరి, ఊర్వశి రౌతెలా విషయంలో ఎందుకు ఈ విషయమై ట్రోలింగ్ జరుగుతోందట.?
ఎందుకంటే, ‘నేను క్రికెట్ చూడను.. నాకు ఇష్టం లేదు..’ అని ఊర్వశి రౌతెలా గతంలో చెప్పింది గనుక.!
Urvashi Rautela Cricket.. ఇంతకీ, రిషబ్ పంత్‌ని కలిసిందా.? లేదా.?
ఊర్వశి రౌతెలా – రిషబ్ పంత్ మధ్య అక్కా తమ్ముళ్ళ బంధం వుందట.! అలాగని, ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒకర్ని ఇంకొకరు ర్యాగింగ్ చేసుకున్నారు.
అసలు విషయమేంటంటే, కొన్నాళ్ళ క్రితం ప్రేమ పేరుతో రిషబ్ పంత్ తన వెంట పడ్డాడంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఊర్వశి రౌతెలా.
‘అక్కా.. నన్ను ఇలా వదిలెయ్.. నీ పబ్లిసిటీ స్టంట్ల కోసం నా పేరు వాడుకోవద్దు..’ అంటూ రిషబ్ పంత్ సెటైరికల్‌గా స్పందించాడు.
‘తమ్ముడూ, నాకు పబ్లిసిటీ స్టంట్లు చేయాల్సిన అవసరం లేదు. సెటైర్లు ఆపి, మైదానంలో బ్యాటింగ్ సరిగ్గా చెయ్..’ అంటూ కౌంటర్ ఎటాక్‌కి దిగింది ఊర్వశి.

మరి, భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ ఎందుకు కనిపించలేదు.? ఊర్వశి అతన్ని అక్కడ కలిసిందా.? లేదా.? ఇలా బోల్డన్ని మీమ్స్ ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఊర్వశి ఏదైనా ‘మాయ’ చేసిందా.?
రిషబ్ పంత్‌ని బహుశా ఊర్వశి మాయం చేసేసి వుండొచ్చు. అతని మీద అక్కసుతో బీసీసీఐ పెద్దలతో మంతనాలు జరిపి, మ్యాచ్ నుంచి తొలగించిందేమో.. అంటూ సెటైర్లు కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో.
Also Read: రాజకీయ సర్వేలు.! రాసుకున్నోడికి రాసుకున్నంత.!
ఎలాగైతేనేం, ఊర్వశి రౌతెలా.. మ్యాచ్ తిలకించింది.. ఈ మ్యాచ్‌లో ‘దాయాది’ పాకిస్తాన్ మీద టీమిండియా కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది.
‘సో, నువ్వు గోల్డెన్ లెగ్గువే..’ అంటూ ఆమె అభిమానులూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఇంతకీ, క్రికెట్ అంటే ఇష్టపడని ఊర్వశి, ఎందుకు మ్యాచ్‌ని ప్రత్యక్షంగా తిలకించిందబ్బా.?