Urvashi Rautela Remuneration.. ఊర్వశి రౌతెలా.. పరిచయం అక్కర్లేని పేరిది. బాలీవుట్ నుంచి కోలీవుడ్.. వయా టాలీవుడ్.. ఈ బ్యూటీ ప్రయాణం గురించి కొత్తగా చెప్పేదేముంది.?
అన్నట్టు, తెలుగులో ఊర్వశి రౌతెలా నటించిన ‘బ్లాక్ రోజ్’ సినిమా ఇంకా విడుదల కాలేదనుకోండి.. అది వేరే సంగతి.
తమిళంలో ఊర్వశి రౌతెలా ‘ది లెజెండ్’ అనే సినిమాలో నటించింది. ఆ సినిమాతో ఊర్వశి రౌతెలా పేరు మార్మోగిపోయింది. వేరే కోణంలో లెండి.!
ఊర్వశి రౌతెలా అంత సొమ్ము లాగేసిందా.?
అరుల్ శరవణన్ అలియాస్ లెజెండ్ శరవణన్ హీరోగా ‘ది లెజెండ్’ సినిమా తెరకెక్కింది. దాదాపు 70 కోట్లదాకా ఈ సినిమా కోసం ఖర్చు చేశారట.
ఊర్వశి రౌతెలా ఈ ‘ది లెజెండ్’ సినిమాలో హీరోయిన్. లక్ష్మ రాయ్ అలాగే యాషికా ఆనంద్ ఈ సినిమాలో కనిపించారు. తమిళంతోపాటు, తెలుగు అలాగే హిందీ భాషల్లోనూ ఈ సినిమాని విడుదల చేశారు.

ఒక్కమాటలో చెప్పాలంటే ‘ది లెజెండ్’ పాన్ ఇండియా మూవీ. ఈ సినిమా కోసం ఊర్వశి రౌతెలా ఏకంగా 20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందట.
Urvashi Rautela Remuneration.. నమ్మేలా వుందా.?
20 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకున్నారట కదా.? అని మీడియా ప్రతినిథి ఒకరు అడిగితే, నవ్వేసి ఊరుకుంది ఊర్వశి రౌతెలా.
‘అంత సొమ్ము ఇస్తే, తీసుకోవడానికి అభ్యంతరమేముంటుంది.? తీసుకున్నానని చెప్పడానికి మొహమాటమేముంది.?’ అని తన సన్నిహితుల వద్ద అభిప్రాయపడిందట ఈ అందాల భామ.
యాభై రెండేళ్ళ అరుల్ శరవణన్‌కి లేటు వయసులో హీరో అవ్వాలనే కోరిక కలిగింది. వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి. సో, ఎడా పెడా ఖర్చు చేసేశాడు సినిమాకి.
Also Read: రాజకీయాల్లోకి రష్మిక.! కాస్కో నా రాజా.!
హీరోయిన్ కోసం గట్టిగానే ఖర్చు చేసి వుంటారుగానీ, మరీ ఇరవై కోట్లు అయితే కాకపోవచ్చు. కానీ, ఊర్వశి హిందీలో తీసుకునే రెమ్యునరేషన్‌కి రెండు రెట్లు, మూడు రెట్లు.. ఆ పైన ఇచ్చే వుంటారు.
అన్నట్టు, ‘బ్లాక్ రోజ్’ సినిమా కోసం కూడా ఊర్వశి రౌతెలా రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.