Ustaad Bhagat Singh Poonamkaur.. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
తొలుత ఈ సినిమాకి ‘భవదీయుడు భగత్ సింగ్’ అని టైటిల్ పెట్టారు. కానీ, కథ మారిపోయింది. తమిళ సినిమా ‘తెరి’కి తెలుగు రీమేక్ ఈ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.!
ఇక, ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ రిలీజ్ చేస్తోంది.
Ustaad Bhagat Singh Poonamkaur హీరోయిన్ అభ్యంతరం..
తాజాగా విడుదల చేసిన ఓ పోస్టర్‌లో హీరో కాళ్ళ కింద టైటిల్ పెట్టారు. పోలీస్ గెటప్‌లో పవన్ కళ్యాణ్ కన్పించనుండగా.. ఆయన కాళ్ళ కింద ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టైటిల్ పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
భగత్ సింగ్ అంటే స్వాతంత్ర్య సమరయోధుడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతటి మహనీయుడి పేరుని, హీరో కాళ్ళ కింద పడేశారేంటి.? అంటూ నటి పూనమ్ కౌర్ అభ్యంతరం లేవనెత్తింది.

చిన్న చిన్న విషయాలే ఇటీవలి కాలంలో పెను వివాదాలకు కారణమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ అంటే వీరాభిమానం వుంది పూనమ్ కౌర్‌కి.
కానీ, అడపా దడపా పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) మీద సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తుంటుందీ బ్యూటీ.
Also Read: The Kerala Story: బాధిత కుటుంబాలేమంటున్నాయ్.?
మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్నేహితుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద పరోక్షంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటుంది పూనమ్ కౌర్ (Poonam Kaur).
ఇంతకీ, ఈ ‘హీరో కాళ్ళ కింద భగత్ సింగ్ టైటిల్’ వివాదం ఎక్కడిదాకా వెళుతుంది.? వేచి చూడాల్సిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
అన్నీ అనుకున్నట్లుగా జరిగి వుంటే, ఈపాటికే సినిమా విడుదలైపోయి వుండేది.! అనివార్య కారణాల వల్ల సినిమా పేరు మారింది.. కథ మారింది.. తెరకెక్కడమూ ఆలస్యమయ్యింది.!