Home » ఉత్తరాంధ్రపై ఉక్కుపాదం: ఇది ఎవరి పాపం.!

ఉత్తరాంధ్రపై ఉక్కుపాదం: ఇది ఎవరి పాపం.!

by hellomudra
0 comments

Uttarandhra inkosari vaarthalloki ekkindi. Uttarandhra loni Visakhapatnam kendram ga kotha railway zone (Visakhapatnam Railway Zone) ni kendra prabhutwam prakatinchindi.

Ayite, kotha railway zone ni prakatinchina Narendra Modi Government, Visakha kendram ga  ippati varaku vunna waltair divison ni vidadeesi, mejority bhaganni Odisha ki appaginchindi. migilina bhagaanni Vijayawada division lo kaluputhoo nirnyam theesukunnaru.

Waltair Mukkalayyindi (Visakhapatnam Railway Zone)

125 years History vunna Waltair Divison kalagarbham lo kalisipotunnanduku badhapadalo, kotha railway zone vachinanduku ananda padalo ardham kavadamledu Uttarandhra Prajalaki.

Decades of fight is now in Dilemma and many are seriously woorying about it. Railway zone ante adi atmagauravam ga bhavinchina Uttarandhra Prajalu, Waltair Division ni thama ‘Uniki’ ga bhavinchaaru.

ఉద్దానం వెతలు పట్టలేదెవరికీ..

‘ఉద్ధానం’ (Uddanam) అనే పేరు ఇప్పుడు ప్రపంచంలో చాలా మందికి తెలుసు. అంతుచిక్కని కిడ్నీ సమస్య ఈ ప్రాంతానికి ఇంతటి పేరు తెచ్చిపెట్టింది. సురక్షిత మంచినీటిని అందించగలిగితే ఉద్ధానం నుండి పూర్తిగా కిడ్నీ సమస్యను పారద్రోలచ్చు. వందల కోట్లు, వేల కోట్లు జనాన్ని ఉద్ధరించేందు కోసం ఖర్చు చేసే పాలకులకు, ఓ చిన్న ప్రాంతంలో మంచి నీటిని అందించడం పెద్ద సమస్య కాదు.

చిక్కోలు చితికిపోయింది..

కానీ దురదృష్టం. ఉద్ధానం కిడ్నీ సమస్యతో రాజకీయ పార్టీలన్నీ ఏళ్ల తరబడి రాజకీయాలే చేస్తున్నాయి. ఉత్తరాంధ్ర పట్ల రాజకీయ పార్టీల ఆలోచన ఏంటో, ఈ సమస్య తీవ్రతను అర్ధం చేసుకుంటే తెలిసిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత పొడవైన తీర ప్రాంతం ఉన్నది శ్రీకాకుళం (Srikakulam – Chiccole) జిల్లాలోనే. కానీ ఆ జిల్లా పట్ల పాలకులెవ్వరికీ శ్రద్ధ లేకుండా పోయింది.

విశాఖకు అడుగడుగునా అన్యాయమే.. (Visakhapatnam Railway Zone)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైద్రాబాద్‌ తర్వాత అతి పెద్ద నగరం విశాఖపట్నం మాత్రమే. కానీ విశాఖ ఎంతగా పాలకుల నిర్లక్ష్యానికి గురైందో అందరికీ తెలుసు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం జిల్లాల్ని ఉత్తరాంధ్రగా పిలుస్తాం. ఇది వెనకబడిన ప్రాంతం. కాదు, కాదు.. వెనక్కి నెట్టివేయబడిన ప్రాంతం. దశాబ్ధాలుగా విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ కావాలనే డిమాండ్‌ ఉత్తరాంధ్ర ప్రజల్లో ఉంది.

పోరాటాల పురిటి గడ్డ ఉత్తరాంధ్ర (Uttarandhra), ఎట్టకేలకు రైల్వే జోన్‌ (Visakhapatnam Railway Zone) సాధించింది కానీ, డివిజన్‌ని కోల్పోయింది. కోరుకున్నదొకటి, జరిగిందొకటి. ఉత్తరాంధ్ర ఉనికికే ముప్పు ముంచుకొచ్చింది.

People of Uttarandhra are demanding Railway zone with Waltair division and it becomes a sentiment. దక్షిణ కోస్తా రైల్వేగా కొత్త రైల్వే జోన్ ప్రకటన వచ్చింది. ఇందులో విజయవాడ, గుంతకల్ డివిజన్లు వుంటాయి. వాల్టేరు నుంచి విడదీసిన కొంత భాగం, విజయవాడలో కలవనుంది.

రాజకీయ క్రీడలో బలిపశవుగా మారిన ఉత్తరాంధ్ర

విశాఖపట్నాన్ని తీసుకెళ్లి విజయవాడ జోన్‌లో కలిపితే, విజయవాడ డివిజన్‌ (Vijayawada Division) కేంద్రంగా రైల్వేజోన్‌ వచ్చినట్లు అవుతుంది కానీ, ఉత్తరాంధ్రకు దీనివల్ల ఒరిగేదేముంటుంది.? అసలు ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకు విలువేముంటుంది.? ఇదే విషయాన్ని ఉత్తరాంధ్ర ప్రజానీకం గట్టిగా నిలదీస్తే, ఆ తర్వాత ప్రాంతాల మధ్య విద్వేషాలు పుట్టుకొచ్చే ప్రమాదముంది.

అప్పడు ఆ విభజన.. ఇప్పుడు ఈ విభజన..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో ఎలాగైతే పాత పేరుతో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల్ని అవమాన పరిచారో ఇప్పుడూ అదే జరుగుతోంది. రైల్వే డివిజన్ (Visakhapatnam Railway Zone) విషయంలో ఇంతటి అన్యాయం జరుగుతుందని ఉత్తరాంధ్ర ప్రజలు కలలో కూడా ఊహించి వుండరు.

అందుకేనేమో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో ఈ రైల్వే జోన్ అన్యాయాన్ని పోల్చుతున్నారు. అప్పుడూ ఎన్నికల ముందు నిర్ణయమే. ఇప్పుడూ ఎన్నికల ముందు నిర్ణయమే. దురదృష్టమేంటంటే, ఉత్తరాంధ్రకు జరిగిన ఈ అన్యాయంపై ఏ రాజకీయ పార్టీ చిత్తశుద్ధితో ప్రశ్నించే పరిస్థితి లేదు. ఉత్తరాంధ్రపై ఇంత వివక్షా.?

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group