Vaishnavi Chaitanya Baby.. బుల్లి తెర నుంచొచ్చి, వెండితెరపై వెలిగిపోతున్న అందాల భామల్ని చాలామందినే చూస్తున్నాం.!
అయితే, యూ ట్యూబ్ సెన్సేషన్స్ కాస్తా సిల్వర్ స్క్రీన్స్ మీద చెలరేగిపోవడం లేటెస్ట్ ట్రెండ్.! ఔను, ఇది నయా ట్రెండ్.! మామూలుగా లేదీ కొత్త ట్రెండ్.!
కేతిక శర్మ (Ketika Sharma) తెలుసు కదా.? ఒకప్పుడు యూ ట్యూబ్ సంచలనం.. ఇప్పుడేమో, సిల్వర్ స్కీన్ మీద సత్తా చాటుతోంది.
ఆ కోవలోకే వస్తుంది వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya).! కాకపోతే, హాట్ అప్పీల్‌తో కాదు.. క్యూట్ అండ్ లవ్లీ అప్పీల్‌తో.!
Vaishnavi Chaitanya Baby.. పక్కింటమ్మాయ్.. మనింట్లో అమ్మాయ్.!
వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) చాలా యూ ట్యూబ్ షార్ట్ ఫిలింస్‌లో నటించింది. అంతేనా, పలు కవర్ సాంగ్స్‌లోనూ సత్తా చాటింది.
వావ్.. వాట్ ఏ క్యూట్ అప్పీల్.! వైష్ణవిని చూసిన వాళ్ళంతా ఇదేమాట చెబుతుంటారు. కెమెరా ముందు ఆమె కాన్ఫిడెన్స్ వెరే లెవల్.!

యూ ట్యూబ్ నుంచి, సిల్వర్ స్క్రీన్ మీదకు వచ్చేసింది వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya). తాజాగా ‘బేబీ’ అనే సినిమాతో పలకరిస్తోంది.
బేబీ.. కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టే జిలేబీ..
సాయి రాజేష్ తెరకెక్కించిన ‘బేబీ’ సినిమా.. ప్రీ రిలీజ్ మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) హీరో.!
వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), డిఫరెంట్ షేడ్స్ వున్న రోల్‌లో కనిపించబోతోంది. స్కిన్ కలర్ దగ్గర్నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు.. రెండూ వేర్వేరు కోణాలు.!
Also Read: Shilpa Shetty.. చెక్కిన శిల్పం.! ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్.!
‘బేబీ’ (Baby Movie) గనుక హిట్టయితే.. తెలుగు సినీ పరిశ్రమలో (Telugu Cinema) నటిగా వైష్ణవి ప్రస్తానం.. ముందు ముందు వెరే లెవల్‌లో వుంటుందని చెప్పొచ్చు.
తెలుగు తెరపై తెలుగమ్మాయిలకు కొరతేమీ లేదు. టాలెంట్ వున్నా, అవకాశాలే సరిగ్గా రావడం లేదు.! మరి, వైష్ణవి చైతన్య విషయంలో ఏం జరుగుతుందో.. వేచి చూడాల్సిందే.