Janhvi Kapoor Sridevi.. అమ్మ లేని లోటు పూడ్చలేనిది.. ఈ మాట పదే పదే చెబుతుంటుంది ‘అతిలోక సుందరి’ శ్రీదేవి గారాలపట్టి, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్.!
ఔను, తన సక్సెస్‌ని అమ్మ శ్రీదేవి చూడలేదన్న ఆవేదన జాన్వీ కపూర్‌లో వుండడం సహజమే.! బహుశా ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా జాన్వీ అనుకుని వుండదేమో.!
అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణం, జాన్వీ కపూర్ జీవితంలో అత్యంత బాధాకరమైన సందర్భం.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
Janhvi Kapoor Sridevi నువ్వు గర్వపడేలా చేయాలని..
‘అమ్మా.. నేనెప్పుడూ నీ కోసం వెతుకుతూనే వుంటాను.. నువ్వు భౌతికంగా లేవన్న నిజాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా..’ అంటూ ఎమోషనల్ అయ్యింది జాన్వీ కపూర్.
‘నువ్వు గర్వపడేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నా.. నన్ను వెండితెరపై చూడాలనుకున్నావు.. నా సక్సెస్ చూసి ఉప్పొంగిపోవాలని నువ్వు అనుకున్నావు..‘‘ అని జాన్వీ పేర్కొంది.

‘నీలో ఆ ఆనందం చూడాలని నేను అనుకున్నాను..’ అని జాన్వీ కపూర్ తన తల్లిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది.
తన తల్లి పైనుంచి తన సక్సెస్‌ని చూస్తోందన్న జాన్వీ, తాను మాత్రం తన తల్లి ఆనందాన్ని చూడలేకపోతున్నానని వాపోయింది.
Also Read: సెటైర్: ప్రభాస్‌కి జ్వరం రావడమేంటి అధ్యక్షా.?
‘ధడక్’ సినిమాతో వెండితెరకు నటిగా పరిచయమైన జాన్వీ కపూర్, పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది.
తెలుగులో కూడా త్వరలో తెరంగేట్రం చేయబోతోంది జాన్వీ కపూర్. యంగ్ టైగర్ ఎన్టీయార్ సరసన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో జాన్వీ హీరోయిన్‌గా నటించనుంది.