Vande Bharat Express.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. తెలుగు రాష్ట్రాల్లో పరుగులు తీస్తోంది. విశాఖపట్నం – సికింద్రాబాద్ నగరాల మధ్య ప్రయాణిస్తోన్న ఈ రైలుకు ఫ్రీ పబ్లిసిటీ దొరుకుతోంది ఓ వ్యక్తి కారణంగా.
సరదాగా రైలెక్కి సెల్ఫీ తీసుకుందామనుకున్నాడు.. ఇంతలోనే రైలు కదిలింది. ఆటోమేటిక్‌గా డోర్లు మూసుకుపోయాయ్.!
స్థానిక దినపత్రికల్లో పబ్లిసిటీ చేసుకోడానికే వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది.! టీవీ ఛానళ్ళలో కనిపించాలంటే.. అదో పెద్ద వ్యవహారం.!
నేషనల్ మీడియాలోనూ కవరేజ్ రావాలంటే.. లక్షల్లో ఖర్చు చేయాల్సిందే. కానీ, అతనికి ఫ్రీ పబ్లిసిటీ దొరికేసింది.! ఎవరా సెలబ్రిటీ.? ఏమా కథ.?
Mudra369
సినిమాల్లో చూస్తుంటాం కదా.. రైలు కదిలాక.. హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్.! హీరోయిన్ పరిగెత్తుకొస్తుంది.. హీరో చెయ్యి చాపుతాడు.. ఆ కిక్కే వేరప్పా.!
సినిమాల్లో సూపర్ హిట్టు..
ఎన్నో సినిమాల్లో ఈ సీన్ సూపర్ హిట్ అయ్యింది. దానికి మించి, ట్రెయిన్‌లో ఇరుక్కుపోయిన ఉదంతం పాపులర్ అయిపోయింది.

ట్రైన్ ఎక్కాక డోర్లు మూసుకుపోతే ఏం చేయాలి.? ఇంకేం చేయడానికి లేదు.. వేరే స్టేషన్ వచ్చేవరకూ ఆగాల్సిందే.!
ఫొటో పైత్యం కాస్తా, ఫైన్ కట్టేదాకా వెళ్ళింది. వేరే స్టేషన్ వరకూ వెళ్ళి, అక్కడి నుంచి మళ్ళీ స్వస్థలానికి రావాల్సి వచ్చింది.
Vande Bharat Express.. పబ్లిసిటీ ముఖ్యం బిగులూ..
అయితేనేం, లక్షలు ఖర్చు చేసినా రాని పబ్లిసిటీ వచ్చేసిందతనికి. లోకల్ మీడియా, స్టేట్ మీడియా, సెంట్రల్ మీడియా.. ఇలా అన్నిట్లోనూ విపరీతమైన పబ్లిసిటీ లభించింది.
Also Read: Pathaan Movie Censor.. అయ్యయ్యో.! అన్నీ కోసి పారేశారే.!
అరరె.! ఈ విషయం తెలియక ఎంతోమంది టిక్కెట్లు కొనుక్కుని రైలు ప్రయాణం చేసేశారే.. అనిపిస్తోంది కదా.?
టిక్కెట్టు లేని ప్రయాణం నేరం.. దానికి జరీమానా కూడా తప్పదు.! అయితేనేం, మనోడు టిక్కెట్టు లేకుండా ప్రయాణించి, అదనంగా నేషనల్ మీడియాలోనూ ట్రెండింగ్ అయ్యాడు.
గూగుల్ తల్లిని ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ గురించి అడిగితే, ఇదిగో.. ఈ మహానుభావుడి ఫొటోలు, వీడియోల్నే చూపిస్తోంది.!