Vangaveeti Mohana Ranga Assassination.. అతన్ని ఆకు రౌడీగా చిత్రీకరించే ప్రయత్నాలు ఇంకా జరుగుతున్నాయి. కానీ, ఆయన్ని బడుగు బలహీన వర్గాలు ‘దేవుడి’లా చూస్తున్నాయి.!
ఓ సామాజిక వర్గానికి చెందిన వీధి రౌడీ.. అనే ముద్ర వేసేందుకు, రెండు బలమైన సామాజిక వర్గాలు చాలా ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నా, కుల మతాలకతీతంగా ఆయన్ని ఆరాధిస్తున్నారు ప్రజలు.
పేరు వంగవీటి మోహన రంగా.! కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.! వంగవీటి మోహన రంగా, చాలా ఏళ్ళ క్రితం దారుణ హత్యకు గురయ్యారు.
బడుగు బలహీన వర్గాల కోసం దీక్ష చేస్తున్న సమయంలో, ఆయన్ని అత్యంత కిరాతకంగా చంపేశారు కొందరు. చంపినోళ్ళు ఎవరో తెలుసు.. చంపించిన వాళ్ళు ఎవరు.? అన్నదీ అందరికీ తెలుసు.!
విజయవాడ ముఠా తగాదాలు ఈ హత్యకు కారణమంటారు కొందరు. కాదు కాదు, రాజకీయ ఆధిపత్య పోరులో భాగంగా జరిగిన హత్య.. అంటారు ఇంకొందరు.
ఓ సామాజిక వర్గానికి బలమైన ప్రతినిథిగా రాష్ట్ర రాజకీయాల్ని శాసించగల శక్తి వంగవీటి మోహన రంగాకి వుందనీ, ఈ క్రమంలో తమ ఉనికికే ప్రమాదమని, రెండు బలమైన సామాజిక వర్గాలు ఒక్కతాటిపైకొచ్చి చేసిన హత్య.. అంటారు చాలామంది.
ఏది నిజం.? నిజమేంటో అందరికీ తెలుసు. మొసలి కన్నీళ్ళు.. అంటాం కదా.! ఆ రెండు సామాజిక వర్గాల ఆధారంగా నడుస్తున్న రాజకీయ పార్టీలు, రంగా హత్యకు కారణం.
ఆ పార్టీలే, వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా మొసలి కన్నీళ్ళు కార్చుతున్నాయి సోషల్ మీడియా వేదికగా.
ఒక్కటి మాత్రం నిజం.. వంగవీటి మోహన రంగా ప్రస్తావన లేకుండా, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు లేవనేంతగా పరిస్థితులు మారాయి.!
ఇంకా, ఆయన మీద ‘ఆకు రౌడీ’ అనే దుష్ప్రచారం జరుగుతూనే వుంది.! ఓ వర్గం మీడియా.. ఇప్పటికీ వంగవీటి మోహన రంగా అంటే, ఉలిక్కిపడుతూనే వుంది.
ఇంతకీ, వంగవీటి మోహన రంగాని చంపేసిందెవరు.? చంపించిందెవరు.? ఇంకెవరు.. ఇప్పుడు మొసలి కన్నీళ్ళు కార్చుతున్నవాళ్ళే.!
వంగవీటి మోహన రంగాని చంపించిన వాళ్ళే, ఆయన ఎంత గొప్ప వ్యక్తో చెబుతున్నారంటే, ఆయన పేరుతో ఇప్పటికీ వాళ్ళకి రాజకీయ లబ్ది కలుగుతోందనే కదా అర్థం.!?
