Varun Tej Lavanya Love వరుణ్ తేజ్ పెళ్ళెప్పుడు.? ఈ ప్రశ్నకి తాజాగా సినీ నటుడు, నిర్మాత, జనసేన నేత ‘మెగాబ్రదర్’ నాగబాబు తనదైన స్టయిల్లో సమాధానమిచ్చారు.!
గత కొన్నాళ్ళుగా లావణ్య త్రిపాటితో వరుణ్ తేజ్ పెళ్ళి.. అంటూ పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారాన్ని గతంలోనే లావణ్య ఖండించింది.
అయినాగానీ, మళ్ళీ కొత్తగా లావణ్య – వరుణ్ తేజ్‌ల పెళ్ళి.. అంటూ పుకార్లు షికార్లు చేయడం మొదలైంది.
Varun Tej Lavanya Love పెళ్ళి గురించి త్వరలోనే ప్రకటన..
‘వరుణ్ తేజ్ పెళ్ళెప్పుడు.?’ అని ఓ ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు నాగబాబు చెప్పిన సమాధానం, ‘త్వరలోనే చెబుతాం’ అని.
ఇంకేముంది.? త్వరలో అంటే.. రేపో మాపో అన్నట్టుగా ప్రచారం షురూ అయ్యింది. ‘నేను చెప్పడం బాగోదు.. అన్ని విషయాలూ వరుణ్ చెబుతాడు..’ అని నాగబాబు చెప్పుకొచ్చారు.
వరుణ్ తేజ్, పెళ్ళికి ముందే వేరే చోట వుంటున్నాడు. ఈ విషయాన్ని నాగబాబు ధృవీకరించారు.
‘వాళ్ళ జీవితం.. వాళ్ళ ఇష్టం.. ఎవరి మీదా బలవంతంగా మన భావజాలాన్ని రుద్దకూడదు కదా..’ అని నాగబాబు చెప్పడం గమనార్హం.
ఇందులో బలవంతపు భావజాలమో, ఇంకొకటో ఏముంటుంది.? పెళ్ళయ్యేవరకు తల్లిదండ్రుల దగ్గర పిల్లలు వుంటారు. ఖచ్చితంగా వుండాలనే రూల్ ఏమీ లేదనుకోండి.. అది వేరే సంగతి.
వేరే చోట వుండటం అంటే..
‘వేరే చోట వుండటం’ అనే మాటపై మళ్ళీ పెడార్ధాలు మామూలే. అంటే, లావణ్య త్రిపాటితో ఆల్రెడీ సహజీవనంలో వున్నాడన్నమాట.. అంటూ వరుణ్‌పై గాసిప్స్ పుట్టుకొస్తున్నాయ్.
వరుణ్ తేజ్ పెళ్ళెప్పుడు.? అన్న ప్రశ్నకు స్పందించినా అదే రచ్చ.. స్పందించకపోయినా అదే రచ్చ.! నాగబాబు అనవసరంగా స్పందించినట్టున్నాడనేది ఇప్పుడు అంతటా వినిపిస్తోన్న అభిప్రాయం.
Also Read: ఎవరు పెద్ద.? ఎవరు చిన్నా.? ఆయనైతే చిరంజీవుడే.!
ఇంతకీ, పెళ్ళి విషయంలో వరుణ్ తేజ్ ఆలోచనలేంటి.? ఏమో, ఆయనేమంటాడో.!
అయినా, తన పెళ్ళెప్పుడన్నదానిపై వరుణ్ తేజ్ ఓ క్లారిటీనో వుండి వుంటాడు. ఒకవేళ వరుణ్ ఎవరితో అయినా ప్రేమలో వున్నా.. దాన్ని ధైర్యంగా చెప్పగలడు.
ఖండిస్తున్నాసరే.. మళ్ళీ మళ్ళీ అవే గాసిప్స్ వస్తోంటే, స్పందించకపోవడమే బెటర్.. అనే నిర్ణయానికి వరుణ్ వచ్చాడేమో.!