Varun Tej Lavanya Parents.. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. నిజ జీవితంలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.
ప్రేమించుకుని.. పెద్దల్ని ఒప్పించి.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్ళి చేసుకున్నారు.. అదీ డెస్టినేషన్ వెడ్డింగ్.!
తాజాగా, ఇటు వరుణ్ అటు లావణ్య.. తామిద్దరం తల్లిదండ్రులం కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
లావణ్య, వరుణ్.. తల్లిదండ్రులు కాబోతున్నారని కొద్ది రోజులుగా గుసగుసలు గుప్పుమంటున్నాయి. ఆ గాసిప్స్‌ని నిజం చేస్తూ, లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్.. సోషల్ మీడియా వేదికగా స్పష్టతనిచ్చారు.
ఓ క్యూట్ ఫొటోని కూడా ఈ జంట సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. పుట్టబోయేది మగబిడ్డా.? ఆడబిడ్డా.? అన్న విషయమై అభిమానుల్లో ఇంట్రెస్టింగ్ డిబేట్ కూడా జరుగుతోందనుకోండి.. అది వేరే చర్చ.
‘ముకుంద’ సినిమాతో వరుణ్ తేజ్, తెలుగు తెరపై తెరంగేట్రం చేస్తే, ‘అందాల రాక్షి’ లావణ్య త్రిపాఠికి తొలి తెలుగు సినిమా.