డే వన్ నుండీ బిగ్‌బాస్ (Bigg Boss 3 Telugu) చూస్తున్న వారికి వరుణ్ సందేశ్ (Varun Sandesh), వితికా షెరూలలో (Vithika Sheru) ఎవరు వీక్ కంటెస్టెంట్ అని అడిగితే, వరుణ్ అని ఠక్కున చెప్పేస్తారు. హౌస్‌లో మిగతా కంటెస్టెంట్స్ నుండి తన భర్తని ( Varun Sandesh Vithika Sheru Romantic ) కాపాడుకోవడానికే వితిక ఎక్కువ టైం కేటాయిస్తుంటుంది.
భార్య కొంగు పట్టుకుని తిరుగుతుంటాడు.. (Varun Sandesh Vithika Sheru Romantic) అనే ముద్ర పడకూడదనే ఆలోచనతో ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరిని సపోర్ట్ చేస్తుంటాడు, ఈ క్రమంలో భార్య వితికతో చీవాట్లు తింటుంటాడు వరుణ్ సందేశ్. పునర్నవి, తమన్నా, శ్రీముఖి.. ఇలా ఒకరేంటీ.? చాలా మంది విషయంలో వరుణ్, వితిక ఆగ్రహాన్ని చవి చూశాడు.
తాజా ఎపిసోడ్‌లో శ్రీముఖి కారణంగా వరుణ్, వితికల మధ్య చిటపటలు చోటు చేసుకున్నాయి. శ్రీముఖి నీకు ఫ్రెండే కదా.. సర్దుకుపో అని వరుణ్, వితికకు సూచించాడు. వితికకు ఒళ్లు మండింది. ఓ పాటేసుకుని, వితికని కూల్ చేసేందుకు ప్రయత్నించాడు వరుణ్ సందేశ్.
ఎప్పుడూ అందర్నీ అర్ధం చేసుకుంటావ్ కానీ, నన్ను అర్ధం చేసుకోవు. నీ మెతక వైఖరి నాకు ఇబ్బందులు తెచ్చి పెడుతోందని వితిక రుసరుసలాడింది. వరుణ్ ఎంత ట్రై చేసినా, వితిక మాత్రం కన్విన్స్ కాలేదు. మరోపక్క ఈ వారం ఎలిమినేషన్‌కి వరుణ్ సందేశ్ నామినేట్ అయ్యాడు. గతవారం వరుణ్ కెప్టెన్‌గా పని చేసిన సంగతి తెలిసిందే.
కెప్టెన్సీ రెస్పాన్సిబులిటీస్ విషయంలోనూ వితికనే సాయం చేయాల్సి వచ్చింది వరుణ్ సందేశ్‌కి. మరోపక్క, వరుణ్ – వితికల మధ్య రొమాంటిక్ ట్రాక్, బుల్లితెర వీక్షకులకు బోల్డంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తోంది.
హౌస్‌లో (Bigg Boss Telugu 3) వరుణ్ – వితికలకు స్పెషల్ ‘ఎడ్జ్’ వుందంటూ హోస్ట్ నాగార్జున వీకెండ్ ఎపిసోడ్‌లో క్లారిటీ ఇచ్చిన సంగతి తెల్సిందే. దాంతో, ఈ రియల్ లైఫ్ కపుల్ మరింత స్వీట్ అండ్ క్యూట్ సరసాలతో హల్‌చల్ చేస్తున్నారన్నమాట బిగ్ హౌస్‌లో.