Veera Simha Reddy Collections.. సంక్రాంతి రేసులో అగ్రస్థానం దక్కించుకున్నది మెగాస్టార్ చిరంజీవి.! ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవ్.!
నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహా రెడ్డి’ (Veera Simha Reddy) పరిస్థితేంటి.? ‘వీర సింహా రెడ్డి’ ఓడిపోయిందా.? ‘వాల్తేరు వీరయ్య’ దెబ్బకి వీర సింహా రెడ్డి గల్లంతయ్యిందా.?
ఓవర్సీస్‌లో ‘వీర సింహా రెడ్డి’ వన్ మిలియన్ డాలర్స్ కొల్లగొట్టడం చిన్న విషయమేమీ కాదు. కాకపోతే, జరిగిన ప్రీ-రిలీజ్ బిజినెస్ నేపథ్యంలో ‘వీర సింహా రెడ్డి’ ఓవర్సీస్‌లో లాస్ వెంచర్ అయ్యిందంతే.
తెలుగు రాష్ట్రాల్లో ‘వీర సింహా రెడ్డి’ స్టేటస్ ఇదీ..
ఓవర్సీస్ సంగతి పక్కన పెడితే, తెలుగు రాష్ట్రాల్లో ‘వీర సింహా రెడ్డి’ పరిస్థితి ఎలా వుంది.? ఈ విషయమై భిన్న వాదనలున్నాయి.

సినిమా రెండో వారంలోకి ప్రవేశించినా, మాస్ సెంటర్స్‌లో ఇంకా ‘వీర సింహా రెడ్డి’ హవా కొనసాగుతోంది.. అదీ, సెలవుల తర్వాత కూడా.
ఓ వైపు ‘వాల్తేరు వీరయ్య’.. ఇంకో వైపు ‘వీర సింహా రెడ్డి’.. పోటా పోటీగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళను రాబడుతున్నాయి.
Veera Simha Reddy Collections.. పోలిక ఎందుకు.?
‘వీర సింహా రెడ్డి’తో పోల్చితే, ‘వాల్తేరు వీరయ్య’ వేగంగానే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ‘వీర సింహా రెడ్డి’ మాత్రం వెనకబడే వుంది.
Also Read: Pathaan Movie Censor.. అయ్యయ్యో.! అన్నీ కోసి పారేశారే.!
అయినాగానీ, ‘వీర సింహా రెడ్డి’ సినిమాకి వచ్చిన రివ్యూలు.. వస్తున్న వసూళ్ళు.. వెరసి, బాలయ్య ఈ సంక్రాంతిని బాగానే క్యాష్ చేసుకున్నట్లు కనిపిస్తోంది.
‘వాల్తేరు వీరయ్య’తో పోటీ పెట్టకుండా చూస్తే మాత్రం, బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో తన స్టామినా నిరూపించుకున్నట్లే.!