Jai Balayya Veera Simha Reddy నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘వీర సింహా రెడ్డి’ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదలైంది.
‘జై బాలయ్యా’ అంటూ సాగే ఈ పాట విజువల్స్ చూస్తోంటే, చాలా రిచ్‌గా దీన్ని తెరకెక్కించారనే విషయం అర్థమవుతోంది.
బోల్డంతమంది జనం.. బోల్డన్ని ట్రాక్టర్లు.. పండగలా వుందీ పాట చూడటానికి.! బాలయ్య తన ట్రేడ్ మార్కు డాన్సులతో అలరించేలా వున్నాడు.
దేవాలయాల్లో కొన్ని షాట్స్ ఈ పాట కోసం చిత్రీకరించినట్టున్నారు. విజువల్‌గా అవి చాలా చాలా బావున్నాయ్.!
Jai Balayya Veera Simha Reddy ఏంటి తమనూ.. మరీనూ.?
సమస్య ఎక్కడ వస్తోందంటే, ట్యూన్‌తోనే.! తెలుగు సినీ పరిశ్రమని ట్యూన్ల కొరత వేధిస్తోంది. మొన్న దేవిశ్రీ ప్రసాద్ ‘వాల్తేరు వీరయ్య’ కోసం రూపొందించిన పాట కూడా, ఎక్కడో విన్నట్లుందే అనిపించింది.
తమన్ తక్కువేం తిన్లేదు.. ఏకంగా, ‘ఒసేయ్ రాములమ్మ’ నుంచి కొన్ని బిట్స్ లాగేశాడు. ‘జై బాలయ్యా..’ అంటూ సాగే థీమ్ కాస్తా, ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమాలోని పాటని గుర్తు చేసింది.
అంతేనా, ‘శ్రీమంతుడు’ (Srimanthudu) సినిమాలోని ఓ పాటని కూడా కాపీ కొట్టేసినట్లున్నాడు తమన్ అనిపిస్తుంది.
వున్నమాటంటే ఉలుకెందుకు.?
తమన్ మీదనే ఈ మధ్య ఈ ‘కాపీ’ ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయ్. ‘అబ్బే, కాపీ అనేదానికి ఛాన్సే లేదు. మన దగ్గర బెస్ట్ సాఫ్ట్‌వేర్ వుంది.. కాపీ ట్యూన్ అయితే ఇట్టే పసిగట్టేస్తుంది..’ అని చెబుతాడు తమన్.
Also Read: ఆల్‌రౌండర్ విశ్వక్‌సేన్.! ఆఫ్ట్రాల్ అర్జున్.! అంతేనా.?
అంటే, వినేవాళ్ళ చెవుల్లోనే ఏదో తేడా వుందనేది బహుశా తమన్ (Thaman) ఉద్దేశ్యమేమో.!

పాట విడుదలకు ముందు ‘సబ్ వూఫర్లు పగిలిపోయాయ్..’ అంటూ తమన్ (SS Thaman) సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ వేశాడు.
ఆ సంగతేమోగానీ, ట్రోలింగ్ మాత్రం అదిరిపోయింది.! కాపీ మాస్టర్ తమన్.. అంటూ నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.