Guess Who.. చదువరి.! ఎవరీ సొగసరి.!
అబ్బో, ఎంత శ్రద్ధగానే చదివేసుకుంటోంది కదా.! ఇంతకీ, ఎవరీ భామ.? ఓ రెండు తెలుగు సినిమాల్లో నటించింది (Sogasari Mudra Neha Sharma) లెండి.!
అంతేనా, మొన్నీమధ్యనే ఓ తెలుగు సినిమాలో జస్ట్ అలా తెరపై కనిపించి మాయమైంది. బాలీవుడ్‌లోనూ ఏమంత గొప్పగా రాణించింది లేదు. కానీ, సోషల్ మీడియాలో సెన్సేషన్.!
ఎడా పెడా ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది ఈ బ్యూటీ. ఈమెకి ఓ చెల్లెలు కూడా.! అక్కని మించిన చెల్లెలు.. సోషల్ మీడియాలో అందాల ప్రదర్శన పరంగా.!
Sogasari Mudra Neha Sharma.. లేడీ చిరుత..
తెలుగు తెరపైకి ‘చిరుత’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ పేరు నేహా శర్మ.! వరుణ్ సందేశ్‌తో ఓ సినిమాలో నటించింది లెండి.!
మొన్నీమధ్యనే వచ్చిన ‘నాన్న’ సినిమాలో జస్ట్ కొన్ని సెకెన్ల పాటు తెరపై కనిపించింది, అదీ మోడల్‌గా.!
చూస్తున్నారు కదా.. ఎంత సీరియస్‌గా చదివేసుకుంటోందో.! కెరీర్ గురించిన చదువు కాదు లెండి.. జస్ట్ టైమ్ పాస్ అంతే.!
వెకేషన్స్‌ని ఎంజాయ్ చేయడంలో నేహా శర్మతో ఎవరూ పోటీ పడలేరేమో.. అన్నంతగా ఎప్పుడూ వెకేషన్స్‌తో బిజీగా వుంటుందామె.
మోడలింగ్ నుంచి సినిమాల్లోకొచ్చిన ఈ బ్యూటీ, మంచి ఛాన్సులిస్తే తానేంటో నిరూపించుకుంటానంటోంది.!
ప్చ్.. ఇకపై కష్టమే.. అనేయొచ్చా.? ఏమో, లక్కు ఎప్పుడైనా తలుపు తట్టొచ్చు.!