Veera Simha Reddy Politics.. నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ సినిమాలోని పొలిటికల్ డైలాగ్స్ విషయమై పెద్ద రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.!
సినిమాని సినిమాగానే చూడాలి.! సినిమా వేరు రాజకీయం వేరు.! అని సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో చెబుతుంటాం. కానీ, నందమూరి బాలకృష్ణ మాత్రం ‘తగ్గేదే లే’ అంటున్నారు.
సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ, ఆ చరిత్ర సృష్టించినవాడి పేరు మారదు.. మార్చలేరు..
Nandamuri Balakrishna
‘వీర సింహా రెడ్డి’ (Veera Simha Reddy) సినిమాలో చాలా పొలిటికల్ డైలాగులు వున్నాయి. అందులో, ‘పేర్లను మార్చడం’పై ఓ పొలిటికల్ డైలాగ్ గట్టిగా పేలింది.
Veera Simha Reddy Politics.. సినిమా.. రాజకీయం.. వేర్వేరు కాదు.!
స్వర్గీయ ఎన్టీయార్ (Nandamuri Taraka Ramarao) పేరుతో వున్న హెల్త్ యూనివర్సిటీకి, పేరు మార్చేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Ys Rajasekhar Reddy) పేరుని వైఎస్ జగన్ ప్రభుత్వం పెట్టిన సంగతి తెలిసిందే.
‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ, ఆ చరిత్ర సృష్టించినవాడి పేరు మారదు.. మార్చలేరు..’ అంటూ ట్రైలర్‌లోనే పవర్ ఫుల్ డైలాగ్ చెప్పశాడు బాలయ్య.!
సినిమాలోనూ ఇంతకు మించిన పవర్‌ఫుల్ డైలాగులు వున్నాయి. ‘ఏ వృద్ధీ.?’ అంటూ మొదలు పెట్టి అభివృద్ధి.. అంటే ఏంటో చెప్పడం మొదలు పెట్టి, వైసీపీ సర్కారుని టార్గెట్ చేశాడు ‘వీర సింహా రెడ్డి’.

ఈ వ్యవహారంపై పెను రాజకీయ దుమారం చెలరేగుతోంది. అయితే, తాజాగా ఆ రాజకీయ దుమారంపై బాలకృష్ణ (Nandamuri Balakrishna) స్పందించారు.
సినిమాని రాజకీయాలకు వాడుకున్నారు..
‘వాస్తవాలు ప్రజలకు తెలుసు..’ అంటూ వైసీపీ చేస్తున్న విమర్శలపై తనదైన స్టయిల్లో వ్యాఖ్యానించిన బాలకృష్ణ, రాష్ట్రంలో ఎమర్జన్సీ పరిస్థితులు వున్నాయన్నారు.
Also Read: ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ దెబ్బకి ‘దిల్’ రాజుకి పగిలింది.!
‘వాస్తవాల్ని సినిమా ద్వారా చెబుతున్నాననీ, ఎమ్మెల్యేగా, ఓటరుగా, సామాన్యుడిగా చెబుతున్నాను’ అని బాలయ్య ప్రకటించడం గమనార్హం.
మొత్తంగా చూస్తే, ‘వీర సింహా రెడ్డి’ సినిమాని రాజకీయాల కోసం బాలకృష్ణ ఖచ్చితమైన వ్యూహంతోనే వాడుకున్నారన్నది నిర్వివాదాంశమన్నమాట.