Veera Simha Reddy నందమూరి బాలకృష్ణ అంటే కేవలం సినీ నటుడు మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ నేత.. ఆ పార్టీ ఎమ్మెల్యే. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారాయన.
‘వీర సింహా రెడ్డి’ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తోన్న నందమూరి బాలకృష్ణ, ట్రైలర్‌తో రాజకీయ కాక రేపేశారప్పుడే.! కాదు కాదు, మంట పెట్టేశారనడం సబబేమో.!
‘‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు మార్చలేరు’’ అంటూ బాలకృష్ణ ఓ డైలాగ్ చెప్పారు ‘వీర సింహా రెడ్డి’ సినిమాలో.
‘‘పదవి చూసుకొని నీకు పొగరేమో బై బర్త్ నా డిఎన్ఏ కె పొగరు ఎక్కువ..’ అంటూ మరో డైలాగ్ కూడా వుంది. ట్రైలర్‌లో ఈ రెండు డైలాగుల్నీ పొందుపరిచారు.
Veera Simha Reddy గుమ్మడికాయల దొంగ ఎవరు.?
ఇంకా ‘వీర సింహా రెడ్డి’ సినిమా ట్రైలర్‌లో మరికొన్ని డైలాగులూ వున్నాయి. కానీ, పైన పేర్కన్న రెండు డైలాగులతో కొందరు భుజాలు తడుముకుంటున్నారు.. ఎవరో తమని గుమ్మడికాయల దొంగ.. అని పిలిచినట్టు.
‘మా జగన్ మోహన్ రెడ్డినే తిడతావా.? నీ సినిమా ఎలా ఆడుతుందో చూస్తాం..’ అంటూ నందమూరి బాలకృష్ణకి వైసీపీ అభిమానులు కొందరు వార్నింగ్ ఇస్తున్నారు.
ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా వైసీపీ ప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే. ఆ పేరు మార్పుని బాలయ్య గతంలోనే ఖండించారు కూడా.
బాలయ్యే ఆ డైలాగ్ రాయించుకున్నారా.?
ఆ వ్యవహారం మీద తన సినిమాలో బాలయ్య డైలాగు రాయించుకున్నారని అనడం ఎంతవరకు సబబు.? సినిమాల్నీ, రాజకీయాల్ని ముడిపెట్టడం సమంజసం కాదు.
ఇక, అదే వైసీపీ అభిమానులు, ‘చూడు చంద్రబాబూ.. నిన్నే బాలకృష్ణ తిడుతున్నది.. టీడీపీని లాక్కున్నావ్ కదా.. దాని గురించే బాలయ్య చెబుతున్నాడు..’ అంటూ ట్విస్ట్ చేసి చెబుతుండడం గమనార్హం.
డైలాగ్ రైటర్, కేవలం పాత్రని మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఆ డైలాగ్ రాశాడా.? లేదంటే, బాలయ్య రాజకీయ కోణంలో ఆ డైలాగ్ రాయించుకున్నారా.? అన్నది ఎవరు తేల్చుతారు.?
Also Read: రాజకీయం రోడ్లపై కాదు.! తుప్పల్లో, డొంకల్లో.!
వివాదాన్ని పక్కన పెడితే, బాలయ్య అభిమానుల్ని అలరింపజేసే అన్ని మాస్ ఎలిమెంట్ సినిమాలో వున్నాయ్.
సగటు సినీ ప్రేక్షకుడ్ని ఆకట్టుకునే కమర్షియల్ ఎలిమెంట్స్‌ని పక్కాగా ఈ ‘వీర సింహా రెడ్డి’ సినిమాలో దర్శకుడు గోపీచంద్ మలినేని పొందుపరిచినట్లు కనిపిస్తోంది.