మొన్న ‘నారప్ప’, ఇప్పుడేమో ‘దృశ్యం-2’.. అసలేం జరుగుతోంది.? బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల్ని ఓటీటీలోనే విడుదల చేయడానికి విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh Drushyam 2) ఎందుకు ఒప్పుకున్నట్టు.?
ఆ మధ్య నాని పరిస్థితి కూడా ఇదే. ‘వి’ సినిమాని ఓటీటీలోనే విడుదల చేయాల్సి వచ్చింది కోవిడ్ పాండమిక్ కారణంగా. ఎట్టి పరిస్థితుల్లోనూ ‘టక్ జగదీష్’ సినిమాని థియేటర్లలోనే విడుదల చేస్తామని నాని చెప్పినప్పటికీ, వేరే దారి లేకుండా పోయింది ‘టక్ జగదీష్’ కూడా డైరెక్టుగా ఓటీటీలోనే విడుదలవ్వాల్సి వచ్చింది.
Venkatesh Drushyam 2.. థియేటర్లుండగా ఓటీటీ ఏల.?
ఇక, ‘దృశ్యం-2’ విషయానికొస్తే, ‘నారప్ప’ కంటే ముందే వెంకటేష్ పూర్తి చేసేసిన సినిమా ఇది. కొన్ని అనివార్య కారణాల వల్ల ‘దృశ్యం-2’ సినిమాని వెనక్కి పెట్టి, ‘నారప్ప’ని ముందుకు తోసేశారు. ‘నారప్ప’ చెప్పుకోదగ్గ విజయాన్నే అందుకున్నా, అది థియేటర్లలో విడుదలై వుంటే ఇంకా బావుండేదేమో.
మలయాళ సినిమా ‘దృశ్యం‘ తెలుగు సహా పలు భాషల్లోకి రీమేక్ అయ్యింది. దానికి సీక్వెల్ ఇప్పుడు వస్తోంది. మోహన్ లాల్ నటించిన సీక్వెల్ (మలయాళ వెర్షన్) ఎప్పుడో విడుదలైపోయింది. దాంతో, వెంకటేష్ ‘దృశ్యం-2’ మీద ఓటీటీ వీక్షకులు ఎంత ఆసక్తి చూపుతారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

కోవిడ్ భయాలు తొలగిపోయి, సినిమాలన్నీ థియేటర్లలోనే నేరుగా విడుదలవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ‘దృశ్యం-2’ (Venkatesh Drushyam 2) సినిమాని నేరుగా ఓటీటీలో విడుదల చేయనుండడం పట్ల వెంకటేష్ అభిమానులూ ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో, ఓటీటీ వీక్షకులు మాత్రం.. ఒకింత ఆనందమే.
Also Read: Pushpa.. సుకుమార్ మాస్టర్ క్లాస్ మేకోవర్.!