Venkatesh Maha KGF ఆయనో రెండు సినిమాలు తీశాడు. ఒకటేమో ‘కేరాఫ్ కంచరపాలెం’. మంచి సినిమానే.! ఇంకోటి ‘ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య’. ఇది చాలామందికి తెలియదాయె.!
ఆ దర్శకుడి పేరు వెంకటేష్ మహా.! చాలామందికి ఇతనెవరో తెలీదు. కానీ, ఇప్పుడాయన హాట్ టాపిక్.! ఔను, ఏకి పారేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు. దాంతో, రాత్రికి రాత్రి పాపులర్ అయిపోయాడు.
ఇంతకీ ఏం చేశాడబ్బా.?
ఓ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూ అది. అందులో, ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆ దర్శక బృందంతోపాటు ఓ సీనియర్ జర్నలిస్టు కూడా వున్నారు.
ఈ క్రమంలో వెంకటేష్ మహా, ‘కేజీఎఫ్’ సినిమా ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆ సినిమాని నీచ్ కమీన్ కుత్తే సినిమాగా అభివర్ణించాడు వెంకటేష్ మహా.
కమర్షియల్ సినిమాల్ని పాప్‌కార్న్ సినిమాలుగా అభివర్ణించాడు వెంకటేష్ మహా.!
పాప్ కార్న్ తింటున్నప్పుడు అది కిందపడితే, సినిమా మిస్ అయినా ఫర్లేదనుకుని.. కిందికి వంగి పాప్ కార్న్ తింటే.. అది కమర్షియల్ సినిమా అట.!
సినిమా పేరు చెప్పనుగానీ.. సినిమా లాస్ట్‌లో అందరికీ ఇందిరమ్మ పథకాల క్రింద ఇళ్ళు ఇచ్చి ఆ మొత్తం బంగారం తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తాడు.. అంత నీచ్ కమీన్ కుత్తేగాడి మీద సినిమా తీస్తే, మనం చప్పట్లు కొడుతున్నాం..
ఇలా సాగింది వెంకటేష్ మహా వ్యవహారం.!
Mudra369
ఏ తల్లి అయినా, తన కొడుకుని ఇలా పెంచాలనుకుంటుందా.? అంటూ ఏవేవో మాట్లాడేశాడు. అక్కడున్నోళ్ళంతా పగలబడి నవ్వేశారు.
‘నేనూ ఇలాంటి సినిమా తీయగలను.. కానీ, కంటెంట్‌కి కట్టుబడి సినిమాలు తీసే తత్వం నాది. కమర్షియల్ సినిమాల పేరుతో అర్థం పర్థం లేని వ్యవహారాలు చేస్తుంటారు..’ అనేశాడయన.
Venkatesh Maha KGF.. కంటెంటు.. కాకరకాయ.!
ఔను, అసలు కంటెంట్ అంటే ఏంటి.? ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోనూ కంటెంట్ లేదంటారు కొందరు. చూసేవాడి దృష్టికోణం అది.
వెంకటేష్ మహా ‘కేజీఎఫ్’ సినిమా విషయంలో విభేదించే హక్కు కలిగి వున్నాడు. ఎవరైనా విభేదించొచ్చు. కానీ, తూలనాడకూడదు కదా.?
Also Read: సుస్మితా సేన్‌కి ‘హార్ట్ ఎటాక్’ రావడమేంటి.?
పైగా, దేశమంతా ‘కేజీఎఫ్’ సినిమాని ప్రశంసించింది. దాన్ని చెత్త సినిమా.. అంటూ వేరే సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడితే ఎలా.?
అటెన్షన్ కోసం ఇంతలా దిగజారిపోవాలా.? దిగజారిపోతే అటెన్షన్ వస్తుందా.?