Venu Swamy Telugu Politics.. వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే, చెప్పేటోడు సిద్ధాంతి అట.! వెనకటికి పెద్దలు చెప్పిన మాట ఇది. చాలా చాలా విస్తృతంగా ప్రచారంలో వుందీ మాట.!
పెద్దల మాట.. చద్దన్నం మూట కదా.! అసలు విషయమేంటంటే, ఆయనో ‘స్వామి’.! పేరేమో ‘వేణు స్వామి’.!
జ్యోతిషం చెబుతాడు.. పూజలు చేస్తాడు.! ఎవరికైనా జాతకం బాగోలేకపోతే, రెమెడీస్ చెప్తాడు. ఖరీదైన రెమెడీస్ అట.
పలువురు సినీ ప్రముఖులు ఆయన్ని ‘గురువుగారు’ అంటారు. రాజకీయ నాయకులూ ఆయన్ని ‘గురువు గారు’ అనే పిలుస్తారు.
Venu Swamy Telugu Politics.. వేణు స్వామి చెప్పిందే జరుగుతుందా.?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఆయనేదో జోస్యం చెప్పాడు.! అది ఫలించిందా.? లేదా.? అన్నదానిపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది.
అన్నట్టు, తెలుగు రాష్ట్రాల్లో ఇంకో పదిహేనేళ్ళు ముఖ్యమంత్రులు మారే అవకాశం లేదట. అంటే, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఇంకో పది పదిహేనేళ్ళు కొనసాగుతారట.
ఇక, తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి కూడా పదిహేనేళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగుతారన్నది వేణు స్వామి చెప్పిన జోస్యం.!
కాంగ్రెస్ రాజకీయాల గురించి కొత్తగా చెప్పేదేముంది.? అసలంటూ ఇప్పుడే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనిపించడంలేదు. రాత్రికి రాత్రి ఈక్వేషన్స్ మారిపోయాయి.
ఇది ప్రజాస్వామ్యం.! ఐదేళ్ళకోసారి ప్రజల మేండేట్ మారిపోతుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పదేళ్ళు ఏకధాటిగా పరిపాలించిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు.
అలాంటిది, పదిహేనేళ్ళు ముఖ్యమంత్రి పదవి లోంచి మారరట.! జగన్, రేవంత్ రెడ్డిలకు అధికారాన్ని కట్టబెట్టేశారు రేవంత్ రెడ్డి.. ఇన్నేళ్ళపాటు.
ఓట్లెయ్యడమెందుకు సామీ.?
ఇంకెందుకు ఓటర్లు.? ఇంకెందుకు ఎన్నికలు.? కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయాన్ని కాస్త జాగ్రత్తగా పరిశీలించి, ఓ నిర్ణయం తీసుకుంటే మంచిది.
ఎన్నికలంటే ప్రత్యక్షంగా వందల కోట్లు ఖర్చు.. పరోక్షంగా వేల కోట్ల ఖర్చు. అవసరమా అదంతా.? తెలుగు రాష్ట్రాలకు వేల కోట్ల డబ్బు మిగిలిపోతుంది ఎన్నికలు పెట్టకపోతే. అంతే కదా.?
ఛత్.. ఏం హౌలత్ అయిపోయింది భయ్.!
అన్నట్టు.. వేణు స్వామి చెప్పే జోస్యం తాలూకు ప్రభావం, ఎన్నికల్లో 1 నుంచి 3 శాం ఓటర్ల మీద ఖచ్చితంగా వుంటుందట. అంటే, ఆ ఓటు బ్యాంకు వేణు స్వామిదేనన్నమాట.!
ఇప్పుడు ఒప్పుకుంటారా.? వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే, చెప్పేటోడు వేణు స్వామి అని.!